వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థిని గౌతమి హత్య: కాలేజ్ ప్రిన్సిపల్ అరెస్టు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులోని కాడుగోడిలోని ప్రగతి కాలేజ్ హాస్టల్ లో మంగళవారం రాత్రి పిస్తోల్ తూటకు బలి అయిన పీయుసీ విద్యార్థిని గౌతమి (18) హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేశారు. బుధవారం రాత్రి ప్రగతి కాలేజ్ ట్రస్ట్ అధ్యక్షుడు కే.ఎం. సోమ్ సింగ్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

గురువారం ఉదయం ప్రగతి కాలేజ్ ప్రిన్సిపల్ ఎస్. ప్రశాంత్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. ఒక అటెండర్ అంత రాత్రిలో లేడిస్ హాస్టల్ లోకి చొరబడి ఇద్దరి అమ్మాయిల మీద పిస్తోల్ తో కాల్పులు జరిపాడని, వారు ఎలాంటి భద్రత చర్యలుతీసుకొకపోవడం వలనే ఈ విధంగా జరిగిందని వారిద్దరిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు.

Bengaluru Pragathi college principal S.Prashanth arrested

లేడీస్ హాస్టల్ లో 70 మంది విద్యార్థినులు ఉన్నారు. కాలేజ్ క్యాంపస్ ఆవరణంలోనే బాయ్స్ హాస్టల్ ఉంది. లేడీస్ హాస్టల్ లో నలుగురు మహిళ వార్డెన్లు ఉన్నారని కాలేజ్ యాజమాన్యం పోలీసులకు చెప్పింది. అయితే కాలేజ్ దగ్గర అంత కట్టుదిట్టమైన భద్రత లేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.

గురువారం ప్రగతి కాలేజ్ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. అదే సమయంలో నిందితుడు మహేష్ ను కాలేజ్ దగ్గరకు పిలుచుకుని వెళ్లిన పోలీసులు విచారణ చేశారు. కాలేజ్ ఆవరణంలోకి ఎలా వెళ్లాడు, ఇద్దరు యువతుల మీద కాల్పులు జరిపిన తరువాత ఎలా తప్పించుకున్నాడనే వివరాలు సేకరించారు. నిందితుడు మహేష్ ను న్యాయస్థానం ముందు హాజరు పరిచి న్యాయమూర్తి అనుమతితో అతనిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

English summary
Bengaluru Pragathi college principal S.Prashanth arrested by Kadugodi police on Thursday, April 2. College 2nd PUC student Gowthami was shot to death at her hostel on Tuesday night
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X