చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆసుపత్రిలో భర్త, పెరోల్ కోసం కోర్టుకు శశికళ, చస్తేనే అంటున్న జైలు అధికారులు, చట్టం!

|
Google Oneindia TeluguNews

Recommended Video

V.K. Sasikala's Husband M Natarajan Lost Life

బెంగళూరు/చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన వీకే శశికళ నటరాజన్ కు పెరోల్ ఇవ్వడానికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. శశికళ నటరాజన్ కు పెరోల్ ఇస్తే లేనిపోని సమస్యలు ఎదురౌతాయని బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు అంటున్నారు. కుటుంబ సభ్యులు చస్తేనే పెరోల్ ఇవ్వడానికి అంగీకరిస్తామని, చట్టప్రకారం చూసినా శశికళకు పెరోల్ వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.

ఆసుపత్రిలో భర్త

ఆసుపత్రిలో భర్త

అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ నటరాజన్ భర్త నటరాజన్ (74) తీవ్ర అనారోగ్యంతో చెన్నై నగర శివార్లలోని గ్లోబల్ హెల్త్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పరిస్థితి సీరియస్

పరిస్థితి సీరియస్

శశికళ భర్త నాటరాజన్ కు ఐసీయూలో కృత్రిమశ్వాస అందిస్తున్నామని చెన్నైలోని గ్లోబల్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. నటరాజన్ పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు గుండోపోటు రావడంతో ఇన్ఫెక్షన్ సోకిందని, ఆయన పరిస్థితి విషమంగా ఉందని సోమవారం వైద్యులు ప్రకటించారు.

శశికళ పెరోల్

శశికళ పెరోల్

చిన్నమ్మ శశికళ పెరోల్ మీద బయటకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే శశికళ బంధువు, చెన్నైలోని ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ పెరోల్ కోసం అనుమతి ఇవ్వాలని తన న్యాయవాదులతో సుప్రీం కోర్టును సంప్రధించారు.

చెన్నైలో శశికళ

చెన్నైలో శశికళ

2017 అక్టోబర్ 7వ తేదీన శశికళ తన భర్తను చూసుకోవడానికి పెరోల్ మీద బయటకు వచ్చి చెన్నై చేరుకున్నారు. ఆసుపత్రిలో భర్తను పరామర్శించిన శశికళ తరువాత చెన్నైలోని ఆమె మేనకోడలు క్రిష్ణప్రియ ఇంటిలో బసచేశారు.

రాజకీయాలు చేశారు !

రాజకీయాలు చేశారు !

నటరాజన్ ను ఆసుపత్రిలో చూసుకోవాలని పెరోల్ మీద బయటకు వచ్చిన శశికళ రెండు రోజులు మాత్రమే ఆసుపత్రిలో భర్తతో కొన్ని గంటలు ఉన్నారని, తరువాత మేనకోడలు క్రిష్ణప్రియ ఇంటిలో ఆమె రాజకీయాలు, ఆస్తుల లావాదేవీల చర్చలు జరిపారని ఆరోపణలు ఉన్నాయి.

జైలు అధికారుల అభ్యంతరం !

జైలు అధికారుల అభ్యంతరం !

శశికళ నటరాజన్ కు గతంలో పెరోల్ ఇవ్వడానికి అంగీకరించి లేనిపోని ఇబ్బందులు ఎదుర్కొన్నామని, మళ్లీ ఇప్పుడు పెరోల్ ఇవ్వడానికి అంగీకరించి మరో సమస్యను ఎదుర్కోలేమని అంటున్నారు. శశికళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే మాత్రం పెరోల్ ఇవ్వడానికి తాము అభ్యంతరం చెప్పమని జైళ్ల శాఖ అధికారులు అంటున్నారు.

చట్టప్రకారం కుదరదు

చట్టప్రకారం కుదరదు

జైల్లో శిక్ష అనుభవిస్తున్న వారు వారి కుటుంబ సభ్యులు ఎవరైనా ఆనారోగ్యంతో బాధపడుతుంలే పెరోల్ మీద బయటకు వచ్చి చూసి పరామర్శించవచ్చు. అయితే పెరోల్ మీద బయటకు వచ్చి చూసిన వ్యక్తినే మరోసారి చూడాలంటే ఆరునెలల తరువాత అవకాశం ఉంటుంది. 2017 అక్టోబర్ 7 పెరోల్ మీద బయటకు వచ్చి భర్తను చూసిన శశికళ మరోసారి నటరాజన్ ను చూడాలంటే ఏప్రిల్ 6వ తేదీ వరకు వేచి చూడాలి.

English summary
ailed AIADMK leader V K Sasikala will apply for parole on Monday as her husband M Natarajan’s health was described by doctors as critical. Bengaluru Prison rejected Parole for Sasikala, as she left from jail in the october month only, and sources saying prison officials informed sasikala parole will be granted if any close family members death only.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X