ఆ భవన శిథిలాల నుంచి అయిదు మృతదేహాలు వెలికితీత
Bengaluru rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం బెంగళూరును బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే వరుసగా నాలుగు రోజులుగా కురుస్తోన్న అతి భారీ వర్షాల వల్ల సగం నీట మునిగిందీ సిలికాన్ సిటీ. ఇప్పుడు తాజాగా దానా తుఫాన్ ప్రభావంతో మరోసారి కుంభవృష్టి సంభవించే అవకాశం లేకపోలేదని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
దీనికి అనుగుణంగా సోమ, మంగళవారాల్లో బెంగళూరులో సంభవించిన వల్ల అతి భారీ వర్షాలు పడ్డాయి. దీని దెబ్బకు బెంగళూరు నగరం మొత్తం నీట మునిగింది. అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరదనీరు పోటెత్తింది. అనేక లేఅవుట్లు, కాలనీ, నివాసాలు నీట మునిగాయి.

ఈ వర్షాల ధాటికి హొరమావు అగర సమీపంలో గల బాబుసాబ్ పాళ్య, అంజనాద్రి లే- అవుట్‌లో నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో అయిదు మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారు. భవన శిథిలాల నుంచి ఇప్పటివరకు అయిదు మృతదేహాలను వెలికతీశారు.
మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో భవనం ఒక్కసారిగా పెద్ద శబ్దం చేస్తూ కుప్పకూలింది. ఆ సమయంలో 17 మంది వరకు అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల్లో కొందరు అక్కడే నివసిస్తోన్నారు. భారీ వర్షం పడుతుండటం వల్ల ఆ మార్గంలో వెళ్తోన్న కొందరు పాదాచారులు, వాహనదారులు కూడా అక్కడే నిల్చున్నారు.

సమాచారం అందిన వెంటనే స్థానిక శాసన సభ్యుడు బైరాతి సురేష్, పోలీసులు, అగ్నిమాపక- రాష్ట్ర, జాతీయ విపత్తు నిర్వహణ విభాగం సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. భవన శిథిలాల నుంచి ఇప్పటివరకు అయిదుమందిని వెలికి తీశారు. చికిత్స కోసం వారిని ఆసుపత్రికి తరలించారు.
మరో అయిదు మృతదేహాలను బయటికి తీశారు. మరో ఏడుమంది చిక్కుకుని ఉన్నట్లు భావిస్తోన్నారు. జేసీబీలతో భవన శిథిలాల తొలగింపు కార్యక్రమం రాత్రంతా కొనసాగింది. అందులో చిక్కుకున్న వారిని గుర్తించడానికి జాగిలాలను రంగంలోకి దించారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications