బెంగళూరులో యువతిపై రియల్ ఎస్టేట్ వ్యాపారి లైంగిక దాడి, కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం!
బెంగళూరు: అద్దె ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి మీద లైంగిక దాడి చెయ్యడానికి విఫలయత్నం చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారిని బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర (ఆర్ఆర్ నగర) పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
కార్పొరేట్ కంపెని
బెంగళూరు నగరంలోని ఓ కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యువతి కొన్ని రోజుల నుంచి అద్దె ఇంటి కోసం గాలిస్తోంది. అన్ని సౌకర్యాలు ఉన్న అద్దె ఇల్లు చిక్కకపోవడంతో సహద్యోగికి విషయం చెప్పింది. సహద్యోగి సహాయంతో యువతికి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓబులేశు పరిచయం అయ్యాడు.
రియల్ నాటకం
జులై 17వ తేదీ ఓబులేశు అన్ని సౌకర్యాలు ఉన్న అద్దె ఇల్లు చిక్కిందని యువతికి చెప్పాడు. హెచ్.వి. హళ్ళి సర్కిల్ దగ్గరకు వస్తే తాను ఇల్లు చూపిస్తానని యువతిని నమ్మించాడు. యువతి హెచ్.వి. హళ్ళి సర్కిల్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓబులేశు స్థానికంగా ఉన్న ఓ లాడ్జ్ దగ్గరకు ఆమెను తీసుకెళ్లాడు.
లైంగిక దాడి
ఇంటి యజమాని ఇక్కడికే వస్తాడని, ముగ్గురు కలిసి వెలుదామని యువతిని నమ్మించిన ఓబులేశు లాడ్జ్ లోని ఓ గదిలోకి తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఓబులేశు యువతి మీద అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేశాడు. యువతి తప్పించుకుని పారిపోయింది.
ఫిర్యాదు చేస్తే చంపేస్తా
రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓబులేశు యువతిని వెంటాడి అడ్డగించాడు. అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించానని తన మీద పోలీసులకు ఫిర్యాదు చంపేస్తానని బెదిరించాడు. అంతే కాకుండా మన ఇద్దరి మద్య శారీరక సంబంధం ఉందని సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, నీ పరువు పోతుందని బెదిరించాడు. అయితే బాధితురాలు బయపడకుండా ఫిర్యాదు చెయ్యడంతో రాజరాజేశ్వరి నగర పోలీసులు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓబులేశును అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.