బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరును ముంచెత్తిన భారీ వర్షం... నీట మునిగిన పలు ప్రాంతాలు...

|
Google Oneindia TeluguNews

శుక్రవారం(అక్టోబర్ 23) బెంగళూరు నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. చాలా ప్రాంతాలు నీట మునగగా.. ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా సౌత్ బెంగళూరులోని చాలా ప్రాంతాలు వర్షానికి తడిచి ముద్దయ్యాయి. మధ్యాహ్నం 2.30గం. నుంచి సాయంత్రం 5.30గంటల మధ్య దాదాపు 1.3మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అదే సమయంలో హిందూస్తాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఎయిర్‌పోర్ట్,కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో దాదాపు 7.7మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిపింది.

వర్షం కారణంగా సౌత్ బెంగళూరులోని చాలా ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కోరమంగళ,బీటీఎం లేఅవుట్,జయనగర,బవసనగుడి,ఆర్ఆర్ నగర్,కెంగెరి,మల్లేశ్వరం కోరమంగళ,బీటీఎం లేఅవుట్,జయనగర,బవసనగుడి,ఆర్ఆర్ నగర్,కెంగెరి,మల్లేశ్వరం ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరినట్లు తెలుస్తోంది.హోసకెరహళ్లిలో మురుగు నీటి కాలువ ఉప్పొంగడంతో ఓ కారు అందులో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చాలాచోట్ల అపార్ట్‌మెంట్లు,ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు నీట మునిగాయి.

Bengaluru receives heavy rains, many areas flooded

మైసూర్ రోడ్,సిల్క్ రోడ్ జంక్షన్,హోసూర్ రోడ్,బన్నెర్‌ఘట్ట రోడ్,బసవన్నగుడి,నయందహళ్లి,ఆర్ఆర్ నగర్,బీజీ రోడ్,తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్‌కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. రాబోయే 24గంటల్లో బెంగళూరు,చుట్టు పక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

English summary
Bengaluru on Friday evening received heavy rain across the city leaving many areas waterlogged, traffic disrupted and drains overflowing.Most parts of South Bengaluru are affected after rain. Video footage sent by the local resident shows a car sailing on in Gurudutt Layout near Hosakerehalli alongside Vrishabhavathi drain during rains. Vehicles in the basement of some apartments and houses in the low-lying areas were submerged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X