బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్ష నరకం: నిందితుడిని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్ తో..

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: పోలీస్ స్టేషన్ లోనే ఓ నిందితుడిని ప్రత్యక్ష నరకాన్ని చూపారు పోలీసులు. అతణ్ని తలకిందులుగా కట్టేసి హాకీ స్టిక్కులతో మరీ చితకబాదేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

అమిత్ షా పేషీలో భారీగా అవినీతి: రూ.16 లక్షల లంచం డిమాండ్!అమిత్ షా పేషీలో భారీగా అవినీతి: రూ.16 లక్షల లంచం డిమాండ్!

పోలీసుల దురాగతాన్ని బయట పెట్టింది. బెంగళూరులోని సుబ్రహ్మణ్యనగర పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడి పేరు యశ్వంత్. సుబ్రహ్మణనగర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పార్కింగ్ కాంప్లెక్స్ లో పని చేస్తున్నాడు. తనతో పాటు పనిచేస్తోన్న 21 సంవత్సరాల యువతి పట్ల రోజూ అతను అసభ్యంగా ప్రవర్తించేవాడు.

 Bengalurus cop of Subramanyanagar thrashing an accused goes viral

అతని వేధింపులను భరించలేక బాధిత యువతి సుబ్రహ్మణ్యనగర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. యశ్వంత పై ఈ ఏడాది మే 10వ తేదీన ఈ ఫిర్యాదు నమోదైంది. అనంతరం యశ్వంత్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనికి చుక్కలు చూపారు. సబ్ ఇన్ స్పెక్టర్ శ్రీకంఠే గౌడ నిందితుడిని తలకిందులుగా చేసి, హాకీ స్టిక్ తో ఉతికి ఆరేశారు. ఈ వీడియో ఎప్పుడు తీశారో తెలియరావట్లేదు గానీ.. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గురువారం ఈ వీడియోపై బెంగళూరు నగర పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు స్పందించారు. ఎస్ఐ శ్రీకంఠే గౌడను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

English summary
In a video that has gone viral, a sub-inspector at Bengaluru's Subramanyanagar is seen thrashing an accused Yashwant following a complaint by a victim who accused Yashwant of sexual and mental harassment. A 21-year-old woman, who was working at a parking complex in Bengaluru, was allegedly harassed regularly by her coworker Yashwant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X