బెంగళూరు సెక్యూరిటీ సంస్థ ఎండీ అరాచకాలు, బూట్ల కాలుతో దాడి, వైరల్ వీడియో !
Recommended Video
బెంగళూరు: బెంగళూరు సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ యజమాని (మేనేజింగ్ డైరెక్టర్) తన ఉద్యోగులను బూట్ల కాలుతో తన్ని అరచకాలు చేసిన ఓ వీడియో బయటకు రావడంతో వైరల్ అయ్యింది. ఉద్యోగుల తల మీద కిరాతకంగా బూట్ల కాలితో దాడి చేసి హింసించిన సెక్యూరిటీ సంస్థ యజమాని సలీఖం ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. సలీం ఖాన్ అరాచకాలు నిత్యం ఇలాగే ఉంటాయని, విదిలేని పరిస్థితుల్లో తాము ఉద్యోగులు చేస్తున్నామని భాదితులు ఆరోపిస్తున్నారు.
మాజీ ఉప ముఖ్యమంత్రికి షాక్, నిన్న ఐటీ దాడులు, నేడు ఈడీ ఎంట్రీ, రేపు విచారణ
పేరుకు మాత్రమే సెక్యూరిటీ ఏజెన్సీ
బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో సలీం ఖాన్ బెంగళూరు సెక్యూరిటీ ఫోర్స్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. బెంగళూరు సెక్యూరిటీ ఫోర్స్ సంస్థలో కర్ణాటకతో పాటు అనేక రాష్ట్రాలకు చెందిన వారు సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగం చేస్తున్నారు. పేరుకు మాత్రమే ఇది సెక్యూరిటీ ఏజెన్సీ. ఆ సంస్థలో పని చేస్తున్న ఉద్యోగులను సలీం ఖాన్ అతి నీతంగా చూస్తూ దాడులు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.
మొదటి సారి కాదు
తన ఉద్యోగుల మీద సలీం ఖాన్ మొదటి సారి ఈ దాడి చెయ్యలేదని, ఇంతకు ముందు అనేక సార్లు దాడులు చేశాడని అనేక మంది ఆరోపిస్తున్నారు. నా తప్పు ఏమీ లేదు సార్, వదిలేయండి అంటున్న ఉద్యోగి కడుపు మీద నిలబడి బూట్ల కాలుతో తల మీద దాడి చేస్తున్న ఓ వీడియో బయటకు రావడంతో అది వైరల్ అయ్యింది. సలీం ఖాన్ ఉద్యోగుల మీద అనేక సార్లు దాడి చేశాడని, ఎవ్వరూ ఫిర్యాదు చెయ్యడానికి ముందుకు రాకపోవడంతో అతని అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని పలువురు సెక్యూరిటీ గార్డులు ఆరోపిస్తున్నారు.
సలీం సంస్కారం ఇదే
సలీం ఖాన్ ఏం నేర్చుకున్నాడో అదే చేస్తున్నాడని, అతని సంస్కారం ఇదే అని ప్రభాత్ యాదవ్ ఆరోపించారు. ఉద్యోగులను హింసిస్తున్న సలీం ఖాన్ ను ఏమి అనాలో మీరే చెప్పండి అంటూ ప్రభాత్ యాదవ్ అంటున్నారు. తన ఉద్యోగుల కడుపుల మీద నిలబడి బూట్ల కాలితో తల మీద దాడి చేస్తున్న సలీం ఖాన్ చివరికి వారిని చంపేయ్యడానికి వెనక్కిపోడని ఆరోపిస్తూ ప్రభాత్ యాదవ్ ట్వీట్ చేశారు.
వీడియో సాక్షం
సలీం ఖాన్ అతని ఉద్యోగులను ఎలా చూసుకుంటాడో చెప్పడానికి ఈ వీడియో ఓ సాక్షం అని నేహా భాన్ అంటున్నారు. ఉద్యోగుల పట్ల దారుణంగా ప్రవర్తించిన సలీం ఖాన్ ను చట్టపరంగా శిక్షించాలని నేహా భాన్ డిమాండ్ చేస్తున్నారు. సలీం ఖాన్ అతని ఉద్యోగలను హింసించిన అరాచకాల వీడియో బయటకు రావడంతో హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు సుమోటో కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
హిందువులు టార్గెట్
సలీం ఖాన్ టార్గెట్ హిందువులను హింసించడమే, అందుకే అతను సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థ నిర్వహిస్తూ అందులో పని చేస్తున్న హిందువుల మీద దాడులు చేస్తున్నాడని, అరాచకాలు చేస్తున్నాడని జయ మహా కాళి ట్వీట్ చేశారు. హిందువులను టార్గెట్ చేస్తున్న సలీం ఖాన్ ను కఠినంగా శిక్షించాలని జయ మహా కాళి ట్వీట్ చేశారు. ఉద్యోగుల పట్ల ప్రవర్తించే తీరు ఇది కాదని, మిస్టర్ సలీం ఖాన్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారని రాహుల్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.