చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Bengaluru: పీఎఫ్ఐకి కుష్కా తినిపిస్తున్న ఎన్ఐఏ, ఏకంగా జిల్లా అధ్యక్షులు టార్గెట్, ఉగ్రవాదులతో లింక్ ? !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/కోలారు: పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సినిమా చూపించాలని ఎన్ఐఏ అధికారులు సిద్దం అయ్యారు. పీఎఫ్ఐ ముసుగులో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. పీఎఫ్ఐ మీద ఎన్ఐఏ పంజా విసరడంతో తట్టుకోలేని కేరళలోని ఆసంఘం ప్రతినిధులు ఇప్పటికే బంద్ నిర్వహించడం జరిగింది. అయితే ఎన్ఐఏ మాత్రం పీఎఫ్ఐ ముసుగులో ఓ వర్గం వాళ్లని ఉగ్రవాదం వైపు లాగడానికి ప్రయత్నిస్తున్న వారి తోలు తీసేయాలని డిసైడ్ అయ్యిందని సమాచారం. కర్ణాటకలోని 10 జిల్లాల్లోని పీఎఫ్ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలకు ఎన్ఐఏ అధికారులు కుష్కా తినిపించేశారు.

Lady: బ్యూటీ సెలూన్ ప్రభు హత్య కేసులో ట్విస్ట్, కవిత, బాయ్ ఫ్రెండ్ అండ్ కో అందర్, మ్యాటర్ ? !Lady: బ్యూటీ సెలూన్ ప్రభు హత్య కేసులో ట్విస్ట్, కవిత, బాయ్ ఫ్రెండ్ అండ్ కో అందర్, మ్యాటర్ ? !

ఉగ్రవాదుల అండతో రెచ్చిపోతున్నారు ?

ఉగ్రవాదుల అండతో రెచ్చిపోతున్నారు ?

పీఎఫ్ఐ, ఎస్ డీపీఐ, సీపీఎఫ్ సంస్థలకు ఉగ్రవాదులు ఆర్థిక సహాయం చేస్తున్నాయని, ఆయుధాలు ఎలా ఉపయోగించాలి, బాంబు పేలుళ్లు ఎలా ప్రయోగించాలి అని శిక్షణ ఇస్తున్నాయని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. కొంతకాలంగా దేశంలోని పీఎఫ్ఐ తదితర సంస్థల మీద ఎన్ఐఏ అధికారులు డేగ కన్ను వేశారు.

స్థానిక పోలీసుల సహకారం

స్థానిక పోలీసుల సహకారం

పాపులర్ ఫ్రెంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సినిమా చూపించాలని ఎన్ఐఏ అధికారులు సిద్దం అయ్యారు. పీఎఫ్ఐ ముసుగులో సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా, ఆ సంస్థ నిర్వహకుల గురించి పూర్తి సమాచారం సేకరించారు.

కేరళలో రెచ్చిపోయి ?

కేరళలో రెచ్చిపోయి ?


సంఘ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని సమాచారం అందుకున్న ఎన్ఐఏ అధికారులు దేశవ్యాప్తంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. పీఎఫ్ఐ మీద ఎన్ఐఏ పంజా విసరడంతో తట్టుకోలేని కేరళలోని ఆసంఘం ప్రతినిధులు ఇప్పటికే బంద్ నిర్వహించడం జరిగింది. కేరళలో పీఎఫ్ఐ నిర్వహించిన బంద్ హింసకు దారితీసి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ద్వంసం కావడమే కాకుండా అనేక మంది అమాయకులకు గాయాలైనాయి.

కర్ణాటకలో ఉగ్రవాదాన్ని కడిగేయాలని ?

కర్ణాటకలో ఉగ్రవాదాన్ని కడిగేయాలని ?


కర్ణాటకలోని 10 జిల్లాల్లోని పీఎఫ్ఐకి చెందిన నాయకులు, కార్యకర్తలకు ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేస్తున్నారు. బెంగళూరు నగరంతో పాటు 10 జిల్లాల్లో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు. విజయపుర జిల్లా అధ్యక్షుడు అష్వక్ జమఖండిని అరెస్టు చేశారు. బెళగావిలో అనేక మంది పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు.

ఆంధ్రా బార్డర్ లో అలర్ట్

ఆంధ్రా బార్డర్ లో అలర్ట్


ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని కోలారు జిల్లా పీఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఇమ్తియాజ్ అహమ్మద్ తో సహా 7 మందిని అధికారులు అరెస్టు చేశారు. కోప్పళ, రాయచూరు, బాగల్ కోటే, యాదగిరి, రామనగర, చామరాజనగర, కలబురిగి, బీదర్, చిత్రదుర్గ, బెళగావితో సహ అనేక జిల్లాలో మంగళవారం వేకువ జామున 4 గంటల నుంచి ఎన్ఐఏ అధికారులు దాడులు చేస్తున్నారు. ఎన్ఐఏ అధికారుల దెబ్బతో పీఎఫ్ఐకి చెందిన కొందరు విలవిలలాడిపోతున్నారు.

English summary
Bengaluru: Several leaders held in Karnataka as NIA cracks down on PFI activities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X