బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కన్నడ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య, హిందూ సంఘం లీడర్ కు నార్కో పరీక్షలు, కోర్టు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసులో హంతకులకు సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న హిందూ యువసేన నాయకుడు నవీన్ కుమార్ అలియాస్ హోట్టే మంజుకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎస్ఐటీ అధికారులు కోర్టుకు మనవి చేశారు.

8 రోజులు విచారణ

8 రోజులు విచారణ

హిందూ యువసేన నాయకుడు అయిన నవీన్ కుమార్ కు గౌరీ లంకేష్ హంతకులతో సంబంధం ఉంటుందని ఎస్ఐటీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 8 రోజులు కస్టడీ గడుపు పూర్తి కావడంతో శుక్రవారం నవీన్ కుమార్ ను ఎస్ఐటీ అధికారులు న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

గంటకు ఒక మాట

గంటకు ఒక మాట

నవీన్ కుమార్ గంటకు ఒక సమాధానం చెబుతున్నాడని, అతను పదేపదే మాట మార్చుతున్నాడని, అతని నుంచి మరన్ని వివరాలు సేకరించడానికి నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని ఎస్ఐటీ అధికారులు కోర్టులో మనవి చేశారు.

Recommended Video

కన్నడ పాత్రికేయురాలు గౌరి లంకేష్ హత్య: ప్రత్యక్ష సాక్షులు
సంబంధం లేని కేసు

సంబంధం లేని కేసు

సంబంధం లేని కేసులో నవీన్ కుమార్ ను అరెస్టు చేశారని, ఇప్పటికే 8 రోజుల పాటు అతన్ని విచారణ చేసిన అధికారులు ఎలాంటి సాక్షాలు సేకరించలేదని ఆయన న్యాయవాది కోర్టులో వాదించారు. గౌరీ లంకేష్ హత్యతో నవీన్ కుమార్ కు ఎలాంటి సంబంధం లేదని ఆయన న్యాయవాది కోర్టులో వాదించారు.

నార్కో పరీక్షలు

నార్కో పరీక్షలు

సంబంధం లేని కేసులో తన కక్షిదారుడు నవీన్ కుమార్ కు నార్కో అనాలసిస్ పరీక్షలు చెయ్యాల్సిన అవసరం లేదని ఆయన న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కేసు విచారణ మార్చి 15వ తేదీకి వాయిదా వేశారు.

English summary
SIT team which is investigating the Gauri Lankesh murder case request to give permission to do the narco test to Naveen Kumar the suspect of Gauri murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X