బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గర్బవతి: నల్లగా ఉందని తలాక్ చెప్పిన టెక్కీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: గర్బవతిగా ఉన్న భార్యను నీవు నల్లగా ఉన్నావని, నీతో కాపురం చెయ్యడం తనకు ఇష్టం లేదని తాను తలాక్ (విడాకులు) చెబుతున్నానని ఓ భర్త ఈమెయిల్ ద్వారా సమాచారం పంపించాడు. భర్త ప్రవర్తనతో చిర్రెత్తుకొచ్చి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.

జంషెడ్ పూర్ కు చెందిన 26 సంవత్సరాల యువతి నోయిడాలోని ఫార్మాసూటికల్ కంపెనీలో రీసెర్చ్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తున్నది. బెంగళూరుకు చెందిన 33 సంవత్సరాల సాఫ్ట్ వేర్ ఇంజనీరుతో నాలుగు నెలల క్రితం ఆమె వివాహం జరిగింది.

పెళ్లి జరిగిన తరువాత నీవు నల్లగా ఉన్నావని, నన్ను మోసం చేశారని భార్యను వేధిస్తూ అసహనం వ్యక్తం చేసేవాడు. అయితే ఇష్టం ఉన్నప్పుడు మాత్రం భార్యతో అతను రెండు నెలలు కాపురం చేశాడు. ఈనెల 5వ తేదిన తాను గర్బవతిని అంటూ ఆమె భర్తకు విషయం చెప్పింది.

Bengaluru Software Engineer Sends Talaq over Email

అంతే గురుడు విడాకులు తీసుకోవడానికి ప్లాన్ వేశాడు. నాలుగు రోజుల తరువాత నాకు నీతో కాపురం చెయ్యడం ఇష్టం లేదని, వెంటనే తలాక్ (విడాకులు) చెబుతున్నానని ఈమెయిల్ లో మెసేజ్ పంపించాడు.

భర్త చేష్టలతో విసిగిపోయిన ఆమె నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి జరిగిన రోజు నుంచి తనను మానసికంగా హింసించాడని ఆమె ఆరోపించింది. పెళ్లి జరగక ముందే తన భర్త, ఆయన కుటుంబ సభ్యులు తనను చూశారని ఆమె పోలీసులకు చెప్పారు.

ఇష్టం లేకపోతే తనను ఎందుకు వివాహం చేసుకున్నారు అని ఆమె ప్రశ్నిస్తున్నది. అక్టోబర్ వరకు తాను భర్తతో కలిసి బెంగళూరులో ఉన్నానని, తరువాత ఉద్యోగంలో చేరడానికి నోయిడా వచ్చానని ఆమె చెబుతున్నది.

అయితే తన భార్యకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, అన్ని కప్పిపెట్టి తనతో వివాహం జరిపించారని సాఫ్ట్ వేర్ ఇంజనీరు ఆరోపిస్తున్నాడు. తమ కుమార్తెకు డస్ట్ అలర్జీ మాత్రమే ఉందని, తన అల్లుడు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. పంచాయితీ పోలీసుల దగ్గర ఉంది.

English summary
The woman said she received the email three days after she told her husband that she was pregnant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X