హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు టెక్కీకి కరోనా వైరస్, అలర్ట్, కూతురి పెళ్లి పక్కన పెట్టి మంత్రి బిజీబిజీ, హైదరాబాద్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్(టెక్కీ)కి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి వారిని అలర్ట్ చేశారు. తెలంగాణకు చెందిన 24 ఏళ్ల యువకుడు బెంగళూరు నుంచి ఫిబ్రవరి 17వ తేదీ దుబై వెళ్లాడు. తరువాత అక్కడ హాంకాంగ్ నుంచి వెళ్లిన ఉద్యోగులతో కలిసి పని చేశారు. తరువాత ఫిబ్రవరి 20వ తేదీన తెలంగాణ టెక్కీ బెంగళూరుకు వాపస్ వచ్చాడు. రెండు రోజుల పాటు బెంగళూరులో ఉన్న ఆ యువకుడు ఫిబ్రవరి 22వ తేదీన హైదరాబాద్ వెళ్లాడు. బెంగళూరు నుంచి వెళ్లిన తెలంగాణ టెక్కీకి కరోనా వైరస్ సోకిందని స్పష్టం అయ్యిందని, అక్కడి ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స పొందాడని, అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు.

ప్రభుత్వ స్కూల్ టీచర్ రాసలీలల వీడియోలు వైరల్, మాజీ విద్యార్థిని, పొలిటికల్ లీడర్స్ అండ, జెండా !ప్రభుత్వ స్కూల్ టీచర్ రాసలీలల వీడియోలు వైరల్, మాజీ విద్యార్థిని, పొలిటికల్ లీడర్స్ అండ, జెండా !

 బెంగళూరులో తెలంగాణ టెక్కీ నివాసం

బెంగళూరులో తెలంగాణ టెక్కీ నివాసం

తెలంగాణకు చెందిన టెక్కీకి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసింది. ఆ తెలంగాణ టెక్కీ బెంగళూరులో నివాసం ఉంటున్నాడు. దుబాయ్ నుంచి నేరుగా బెంగళూరు వచ్చిన తెలంగాణ టెక్కీ రెండు రోజుల తరువాత ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లాడు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లిన టెక్కీకి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూడటంతో కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బళ్లారి శ్రీరాములు బెంగళూరులో అత్యవసరంగా వైద్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాలసిన జాగ్రత్తలపై చర్చించారు.

 మంత్రి శ్రీరాములు ట్వీట్

మంత్రి శ్రీరాములు ట్వీట్

ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించిన మంత్రి బళ్లారి శ్రీరాములు వెంటనే ట్వీట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లిన టెక్కీకి కరోనా వైరస్ సోకిందని వెలుగు చూసిందని, అతను బెంగళూరులో ఎక్కడ నివాసం ఉంటున్నాడు అని వివరాలు సేకరించి అక్కడ అతనితో పాటు నివాసం ఉంటున్న వారు అందరికీ వైద్యపరీక్షలు చేయించామని మంత్రి బళ్లారి శ్రీరాములు వివరించారు.

 కరోనా వైరస్ కు చెక్ పెట్టాంటే ఏం చెయ్యాలి !

కరోనా వైరస్ కు చెక్ పెట్టాంటే ఏం చెయ్యాలి !

ఆరోగ్య శాఖ సీనియర్ అధికారులతో మంత్రి శ్రీరాములు ఆయన నివాసంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాపించకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి ? అనే విషయంపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించామని, ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లు, సీనియర్ అధికారులు పాల్గోన్నారని మంత్రి బళ్లారి శ్రీరాములు ట్వీట్ చేశారు. కరోనా వైరస్ వ్యాపించకుండా కర్ణాటక ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని మంత్రి బళ్లారి శ్రీరాములు ట్వీట్ లో వివరించారు.

 సహాయక కేంద్రం నెంబర్

సహాయక కేంద్రం నెంబర్

కర్ణాటకలో కరోనా వైరస్ వ్యాపించకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నదని మంత్రి శ్రీరాములు వివరించారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నా, ఎలాంటి సందేహాలు ఉన్నా వెంటనే సహాయక కేంద్రం 104 నెంబర్ కు ఫోన్ చెయ్యాలని మంత్రి శ్రీరాములు ప్రజలకు మనవి చేశారు.

 బెంగళూరు ఎయిర్ పోర్టులో !

బెంగళూరు ఎయిర్ పోర్టులో !

కరోనా వైరస్ పీడిత దేశాల నుంచి బెంగళూరు వచ్చిన 468 మంద్రి ప్రయాణికులకు వైద్యపరీక్షలు చేయించారని, అందులో 284 మంది ప్రయాణికుల చిరునామాలు గుర్తించి అక్కడికి వెళ్లి అధికారులు వారికి మళ్లీ వైద్యపరీక్షలు నిర్వహించారని, అందులో ఓ ప్రయాణికుడికి ప్రత్యేక నిఘా కేంద్రంలో చికిత్స అందిస్తున్నారని మంత్రి శ్రీరాములు ట్వీట్ చేశారు. కరోనా వైరస్ అనేక దేశాల్లో వ్యాపించిన తరువాత ఇప్పటి వరకు విదేశాల నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న 39, 391 మంద్రి ప్రయాణికులకు వైద్యపరీక్షలు నిర్వహించారని, ఎవ్వరికీ కరోనా వైరస్ సోకినట్లు వెలుగు చూడటేదని మంత్రి శ్రీరాములు ట్వీట్ చేశారు.

Recommended Video

Coronavirus : First Positive Case In Telangana | Oneindia Telugu
కూతురి పెళ్లి పక్కన పెట్టిన మంత్రి !

కూతురి పెళ్లి పక్కన పెట్టిన మంత్రి !

కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి బళ్లారి శ్రీరాములు కుమార్తె కుమారి రక్షిత వివాహం ఇదే నెల 5వ తేదీన బెంగళూరు ప్యాలెస్ మైదానంలో జరగనుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లిన తెలంగాణ టెక్కీకి కరోనా వైరస్ వ్యాపించిందని తెలుసుకున్న వెంటనే మంత్రి శ్రీరాములు అలర్ట్ అయ్యారు. కుమార్తె పెళ్లి పనులు పక్కన పెట్టి, ఆ బాధ్యతలు సన్నిహితులకు అప్పగించిన మంత్రి బళ్లారి శ్రీరాములు ఆరోగ్య శాఖ అధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించి కరోనా వైరస్ వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

English summary
Bengaluru techie tested positive for the coronavirus. Karnataka health minister B.Sriramulu called officials meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X