బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీడియో తీసినందుకు టెక్కీపై హెల్మెట్‌తో దాడి

By Pratap
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఫుట్‌పాత్‌పై స్కూటర్ ‌నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడుతున్న తనను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు ప్రయత్నించిన టెక్కీపై ఓ వాహనదారుడు స్కూటరు ఆపి చితకబాదాడు. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. టెక్కీపై అతను హెల్మెట్‌తో దాడి చేశాడు.

ఆ వీడియో ఫుటేజ్ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ కావడంతో వైరల్ అయింది. బెంగళూరు సిటీ స్టార్టప్ జోన్ కోరమంగళ్ సమీపంలో ఫుట్‌పాత్‌పై స్కూటర్లు నడుపుతూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారి ఫోటోలు తీయడం, వాటిని రిపోర్ట్ చేయడం వల్ల అలాంటి ఘటనలు తగ్గే అవకాశం ఉందని అంకిత్ చౌదరి అనే 26 ఏళ్ల టెక్కీ ఆలోచించాడు.

Bengaluru Techie Tried To Film Rule-Breaker, Assaulted

ఇందులో భాగంగానే ఫుట్‌పాత్‌పై స్కూటర్ నడుపుతున్న ఒక వ్యక్తి ఫోటోను సెల్‌ఫోనులో చిత్రీకరిస్తుండగా అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. ఆ వ్యక్తి స్కూటర్ ఆపి నేరుగా చౌదరి వైపు దూసుకొచ్చాడు. అతని చేతిలోని హెల్కెట్‌తోనే దాడికి దిగాడు. ఆ ఘటన సెల్‌లో రికార్డు కావడంతో దానిని చౌదరి తన ఫేస్‌బుక్ పేజ్‌లో సోమవారం పోస్ట్ చేశాడు.

పేవ్‌మెంట్‌పై స్కూటర్ నడుపుతున్న ఫోటోను తాను బెంగళూరు పోలీస్ ట్రాఫిక్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేయాలనుకున్నానని చౌదరి అంటున్నాడు. పాదచారుల కోసం ఉద్దేశించిన పేవ్‌మెంట్‌పై స్కూటర్లు నడపడం సిగ్గుపడాల్సిన విషయం కాదా అని దాడికి పాల్పడిన వ్యక్తి ఆ వీడియో ఫుటేజ్‌ను తొలగించాలని చౌదరిని కోరినట్టు పోలీసులు చెబుతున్నారు. వీడియోలో అంకిత్‌పై దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

English summary
When the owner of a start-up in Bengaluru saw a man riding his scooter on a pavement, he tried to film the traffic violation on his cellphone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X