వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Bengaluru Lock Down: ప్రభుత్వ నిర్ణయంపై FKCCI మండిపాటు, 20 శాతం కంపెనీలు క్లోజ్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు పెరగడంతో బెంగళూరు రూరల్, అర్బన్ జిల్లాల్లో వారం రోజులు ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో లాక్ డౌన్ ప్రారంభమవుతోంది. మంగళవారం రాత్రి 8 గంటల నుంచి ఈ నెల 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. లాక్ డౌన్ విధిస్తామని ముందుగానే ప్రకటించడంతో గత మూడురోజుల నుంచి బెంగళూరును వదిలి వెళ్లిపోతున్నారు. ఎంతమంది వెళ్లిపోయారనే అంశానికి సంబంధించి లెక్క తెలియదు.. కానీ 5 లక్షల మంది వరకు సిటీ వదిలిపోయినట్టు తెలుస్తోంది.

తప్పలేదు..

తప్పలేదు..

వాస్తవానికి లాక్ డౌన్ విధించబోము అని ఇదివరకు సీఎం యడియూరప్ప ప్రకటించారు. కానీ కర్ణాటకలో కేసులు పెరగడంతో బెంగళూరు అర్బన్, రూరల్ జిల్లాల్లో వారం రోజులు లాక్ డౌన్ విధిస్తున్నారు. దీంతో పరిశ్రమలు, వ్యాపారులు, వలస కూలీలు, పేదలు, మధ్యతరగతి ప్రజలపై ప్రభావం చూపనుంది. లాక్ డౌన్ వల్ల పని ఉండదని వారు అనుకొని తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోయారు.

రూ.7 వేల కోట్లు

రూ.7 వేల కోట్లు

లాక్‌డౌన్ సమయంలో కూడా కర్ణాటక ప్రభుత్వానికి చెప్పుకోదగ్గ పన్ను వసూలయ్యింది. ఏప్రిల్, మే నెలలో రూ.100 కోట్ల వరకు జీఎస్టీ వసూల్ చేశారు. కానీ లాక్ డౌన్ సడలింపులతో జూన్‌లో రూ.7 వేల కోట్లు కలెక్ట్ చేసి.. రాష్ట్ర ఖజానాకు బూస్టింగ్ ఇచ్చారు. కానీ ఈ సమయంలో మరోసారి లాక్ డౌన్ విధించడం పరిశ్రమ వర్గాలను ఇబ్బందికి గురిచేస్తోంది.

గట్టి దెబ్బ..

గట్టి దెబ్బ..


లాక్ డౌన్ వల్ల ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని.. మళ్లీ విధిస్తే ఎలా అని కూడా అంటున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కర్ణాటక ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ బహిరంగంగానే విమర్శిస్తోంది. లాక్ డౌన్ వల్ల ఆర్థిక వ్యవస్థ దిగజారిపోతుందని అధ్యక్షుడు సీఆర్ జనార్ధన్ తెలిపారు.

20 శాతం కంపెనీలు క్లోజ్

20 శాతం కంపెనీలు క్లోజ్


వైరస్ వ్యాప్తికి పరిశ్రమలు కారణం కాదు అని పేర్కొన్నారు. 20 శాతానికి పైగా పరిశ్రమలు మూసివేసి ఉన్నాయని తెలిపారు. మిగిలిన పరిశ్రమల వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని గుర్తుచేశారు. కొందరి వ్యాపారం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. ఇప్పుడు విధిస్తోన్న లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు.

English summary
Lakhs of people mostly from the lower strata of the society have fled Bengaluru in the last three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X