బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దూల తీరింది, బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు ఎన్ని రూ. లక్షలు వసూలు చేశారంటే!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలో నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడపుతున్న వారి మీద ట్రాఫిక్ పోలీసులు పంజా విసురుతున్నారు. గత ఆరు రోజుల్లో బెంగళూరు పోలీసులు రూ. 72 లక్షలు అపరాద రుసుం వసూలు చేసి రికార్డు సృష్టించారు. గత ఆరు రోజుల్లో 1,968 కేసులు నమోదు చేసిన బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఏకంగా రూ. 72, 49, 900 అపరాద రుసుం వసూలు చయ్యడంతో వాహన చోదకులకు దూల తీరిపోయింది.

భర్తను చంపేసి జైలుకు వెళ్లింది, నేడు పెళ్లి పత్రిక ఇచ్చే నెపంతో, దుమ్ము లేపేశారు!భర్తను చంపేసి జైలుకు వెళ్లింది, నేడు పెళ్లి పత్రిక ఇచ్చే నెపంతో, దుమ్ము లేపేశారు!

వనే వే లో వెళ్లారు

వనే వే లో వెళ్లారు

వన్ వే రహదారుల్లో వెలుతున్న 425 మంది మీద ట్రాఫిక్ పోలీసులు కేసులు నమోదు చేశారు. వన్ వేలో వాహనాలు నడుపుతున్న వారి నుంచి రూ. 2,12,500 అపరాద రుసుం వసూలు చేశారు. కొత్త ట్రాఫిక్ చట్టం నియమాలు అమల్లోకి వచ్చిన తరువాత బెంగళూరు పోలీసులు వాహన చోదకుల మీద విరుచుకుపడుతున్నారు.

హెల్మెట్ లు లేవని !

హెల్మెట్ లు లేవని !

హెల్మెట్ లు లేకుండా బైక్ లు నడుపుతున్న 1, 968 మందిని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు రూ. 19,68,000 అపరాద రుసుం వసూలు చేశారు. నెంబర్ ప్లేట్ లు లేని 11 వాహనాలు గుర్తించి రూ. 5,500, సీట్ బెల్ట్ లేదని 708 కేసులు నమోదు చేసి రూ. 7,08,00 అపరాద రుసుం వసూలు చేశారు.

డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్

డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్

డ్రైవింగ్ లైసెన్స్ లేని 10 మందిని గుర్తించి రూ. 50, 000, వాహనాల ఇన్సూరెన్స్ పత్రాలు లేవని 109 మందిని గుర్తించి రూ. 14, 40, 800 అపరాద రుసుం వసూలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 72 మందిని గుర్తించి కోర్టులో అపరాద రుసుం చెల్లించాలని ట్రాఫిక్ పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మొబైల్ లో మాట్లాడితే !

మొబైల్ లో మాట్లాడితే !

మొబైల్ లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతున్న 695 మందిని గుర్తించి రూ. 13,90,000 అపరాద రుసుం వసూలు చేశారు. యూటర్న్ లేని రోడ్ల మీద వాహనాలు నడిపిన 8 మందిని గుర్తించి రూ. 4, 400 అపరాద రుసుం వసూలు చేశారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని బెంగళూరు నగర ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ రవికాంత్ గౌడ హెచ్చరించారు.

English summary
Karnataka: Bengaluru Traffic Police have collected a fine of Rs 72 lakh in the last one week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X