బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో భారీ వర్షం, మూడు రోజులు జాగ్రత్త, సాయంత్రం కుండపోత, ట్రాఫిక్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక రాజధాని, ఐటీ, బీటీ సంస్థలకు ప్రసిద్ది చెందిన బెంగళూరు నగరంలో బుధవారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని ప్రముఖ నగరాలు, పట్టణాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

బెంగళూరు నగరంలో ఈనెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు భారీ వర్షం పడే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం నుంచి బెంగళూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది.

Bengaluru witnessed heavy rain accompanied by thundershowers and lightning.

సాయంత్రం వర్షం పడటంతో నగరంలోని వివిద ప్రాంతాలు జలమయం అయ్యాయి. నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచిపోయింది. కార్యాలయాల నుంచి సాయంత్రం ఇంటికి బయలుదేరిన ఉద్యోగులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బెంగళూరు నగరంలోని మెజస్టిక్, సిటీ మార్కెట్, శివాజీనగర్, జయనగర, సిల్క్ బోర్డు, బీటీఎం లేఔట్, కోరమంగల, గిరినగర, శ్రీనివాస నగర, శ్రీనగర్, హోసకరహళ్ళి, బసవనగుడి, మల్లేశ్వరం తదితర ప్రాంతాల్లో బుధవారం మద్యాహ్నం 2 గంటల నుంచి వర్షం మొదలైయ్యింది.

బీబీఎంపీ సిబ్బంది రోడ్ల మీద నిలిచిపోయిన వర్షం నీరును అక్కడి నుంచి తొలగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. బెంగళూరు నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజ్ లో నిండిపోయి మురికినీరు రోడ్ల మీదకు రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎధుర్కొంటున్నారు.

English summary
Bengaluru witnessed heavy rain accompanied by thundershowers and lightning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X