బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తొలి ట్యాక్సీ డ్రైవర్: ఆ ఏపీ మహిళ మృతి వెనుక.. షాకింగ్?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఆంధ్రా ప్రాంతం నుంచి కర్నాటకకు వలస వెళ్లిన తొలి మహిళా క్యాబ్ డ్రైవర్ భారతి నాలుగు రోజుల క్రితం చనిపోయింది. ఆమె ఆనుమానాస్పద మృతికి కారణాలు ఏమిటో బయటకు వచ్చాయని వార్తలు వస్తున్నాయి. ఆమె గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

తొలి ట్యాక్సీ డ్రైవర్‌గా రికార్డ్ సృష్టించిన ఏపీ మహిళ బలవన్మరణం

ఆమె ఆత్మహత్య పాల్పడటానికి ఒంటరితనం, మానసిక ఒత్తిడి కారణమని చెబుతున్నారు. ఆమె లింగమార్పిడి చేయించుకున్నారని (స్త్రీ నుంచి పురుషుడిగా మారి), గత నాలుగేళ్లుగా ఓ మహిళతో కలిసి ఉంటోందని చెబుతున్నారు. ఇటీవలే వారి మధ్య విభేదాలు వచ్చి ఆ మహిళ వెళ్లిపోయిందని అంటున్నారు.

lady

ఒకసారి వారి మధ్య తీవ్ర గొడవ జరిగిందని, భౌతికంగా భారతి పైన ఆమె దాడి చేసిందని, ఈ మధ్య ఆమె పైన చేయి కూడా చేసుకుందని, ఆ తర్వాత వెళ్లిపోయి వేరే వ్యక్తితో ఉంటోందని, ఇది ఆమెను మానసిక ఒత్తిడికి గురి చేసి ఉంటుందని అంటున్నారు.

అందువల్లే ఇటీవలే సొంత గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకొని ఉంటుందని, ఓ న్యాయవాదికి ఫోన్ చేసి ఓ చంటిబిడ్డను దత్తత తీసుకోవాలని భావిస్తున్నానని, అందుకు సంబంధించిన న్యాయ సలహాలు ఇవ్వాలని అడిగిందని, ఈలోగానే ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. అయితే, పోస్టుమార్టం నివేదిక వచ్చాక పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

English summary
It was a tragic end to the inspirational life story of India's first female cab driver. Veerath Bharathi, who rode her city and dreams on wheels is dead, and the Bengaluru Police suspect she may have committed suicide out of depression and loneliness.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X