బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్కా, చెల్లి పెళ్లి: టీవీలో అక్క ముఖం గుర్తు పట్టిన కంపెనీ, ఉద్యోగం ఊడింది, ప్రపంచంలో !

బెంగళూరులో రెండు రోజుల క్రితం అక్కా, చెల్లి పెళ్లి చేసుకున్నారని కొన్ని టీవీ చానల్స్ లో జోరుగా ప్రసారం చేశారు. అక్కా, చెల్లి స్వలింగ సంపర్కులు అంటూ కథనాలు ప్రసారం చేశారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులో రెండు రోజుల క్రితం అక్కా, చెల్లి పెళ్లి చేసుకున్నారని కొన్ని టీవీ చానల్స్ లో జోరుగా ప్రసారం చేశారు. అక్కా, చెల్లి స్వలింగ సంపర్కులు అంటూ కథనాలు ప్రసారం చేశారు. ఆ ఇద్దరిలో 25 ఏళ్ల యువతి కాల్ సెంటర్ లో ఉద్యోగం చేస్తున్న విషయం తెలిసిందే.

<strong>బెంగళూరులో అక్కా, చెల్లి పెళ్లి, కాపురం: తలపట్టుకున్న ఫ్యామిలీ, కేసు !</strong>బెంగళూరులో అక్కా, చెల్లి పెళ్లి, కాపురం: తలపట్టుకున్న ఫ్యామిలీ, కేసు !

రెండు రోజుల పాటు కొన్ని టీవీ చానల్స్ లో 25 ఏళ్ల అక్క, 21 ఏళ్ల చెల్లి పెళ్లి, కాపురం అంటూ వార్తలు వచ్చాయి. ఇద్దరు అమ్మాయిల ముఖాలను బ్లర్ చేసి టీవీల్లో వార్తలు ప్రసారం చేశారు. అమ్మాయిల ముఖం ఎవ్వరూ గుర్తు పట్టకుండా ఉండాలని వారి ముఖం బ్లర్ చేసి చూపించారు.

ఎంత మాయ చేసినా అక్క

ఎంత మాయ చేసినా అక్క

అయితే అక్కడే టీవీ చానల్స్ పప్పులో కాలేశాయి. ఎలక్ట్రానికి మీడియా ఎన్ని జిమ్మిక్కులు చేసి మాయ చేసినా 25 ఏళ్ల యువతి ఉద్యోగం చేస్తున్న జోగేఫో డాట్ కమ్ కంపెనీ నిర్వహకులు ఆమెను గుర్తు పట్టేశారు. అంతే చెల్లితో కాపురం చేస్తున్న 25 ఏళ్ల యువతిని ఉద్యోగంలో నుంచి తొలగించారని ఓ కన్నడ టీవీ చానల్ కథనం ప్రసారం చేసింది.

ఇంత అవసరమా ?

ఇంత అవసరమా ?

బెంగళూరులో 25 ఏళ్ల అక్క, 21 ఏళ్ల చెల్లి పెళ్లి చేసుకున్న విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా అత్యుత్సాహం చూపించందని, వారి జీవితాలతో చెలగాటం ఆడటానికి ప్రయత్నించారని ఎల్ జీబీటీ (లింగమార్పిడి, స్వలింగ సంపర్క హక్కుల సంఘం) ప్రతినిధులు మండిపడ్డారు.

ఇప్పటికే ఎన్నో సమస్యలు

ఇప్పటికే ఎన్నో సమస్యలు

బెంగళూరులో ఎల్ జీబీటీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే తాము సమాజంలో ఎన్నో సమస్యలతో జీవన పోరాటం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారని టీవీ చానల్స్ లో పదేపదే ప్రసారం చెయ్యడాన్ని తీవ్రంగా ఖండించారు.

మాకు ఆ హక్కులు లేవా ?

మాకు ఆ హక్కులు లేవా ?

ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారని టీవీ చానల్స్ పదేపదే ప్రసారం చేసి వారి వ్యక్తిగత జీవితాలతో చెలగాటం ఆడారని మండిపడ్డారు. ఇప్పుడు వారు తల ఎత్తుకుని సమాజంలో ఎలా తిరుగుతారు ? వారి హక్కులను మంటగలిపిన టీవీ చానల్స్ ఇప్పుడు వారికి న్యాయం చేస్తారా ? అని ప్రశ్నించారు.

సుప్రీం కోర్టు ఏం చెప్పింది ?

సుప్రీం కోర్టు ఏం చెప్పింది ?

సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం మేము ఎవరో చెప్పుకునే హక్కు మాకే ఉందనే విషయం మరిచిపోరాదని అన్నారు. మేము ఫలానా అనే విషయం మీరు ప్రపంచానికి చాటి చెప్పడం నేరం అనే విషయం మీడియాకు తెలీదా అని టీవీ చానల్స్ నిర్వహకులను సూటిగా ప్రశ్నించారు.

ప్రపంచంలో ఎక్కడా జరగలేదా ?

ప్రపంచంలో ఎక్కడా జరగలేదా ?

ఇద్దరు మహిళలు కలిసి జీవించడం నేరం అంటున్నారు, అయితే ప్రపంచంలో ఇలా ఎక్కడా జరగలేదా ? అని టీవీ చానల్స్ నిర్వహకులను ప్రశ్నించారు. వివాహం అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత విషయం అనే సంగతి మీడియా మరిచిపోరాదని గుర్తు చేశారు.

టీఆర్ పీ రేటింగ్ ల కోసమే !

టీఆర్ పీ రేటింగ్ ల కోసమే !

సమాజంలో తాము గౌరవంగా జీవించడానికి మీడియా ఇంత కాలం అండగా ఉందని ఇదే సందర్బంలో చెప్పారు. అయితే మొదటి సారి ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారని టీఆర్ పీ రేటింగ్ ల కోసం కొన్ని టీవీ చానల్స్ అత్యుత్యాహం చూపించిందని విచారం వ్యక్తం చేశారు.

ఇది పోలీసులు చేసిన పనే

ఇది పోలీసులు చేసిన పనే

విజయనగరకు చెందిన ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుని కోరమంగలలో కాపురం పెట్లారని గుర్తించిన పోలీసులు ఆ విషయం మీడియాకు చెప్పారని పోలీసుల మీద విరుచుకుపడ్డారు. ఇద్దరు అమ్మాయిల మేము ఆదుకుంటామని ఎల్ జీబీటీ ప్రతినిధులు హామీ ఇచ్చారు.

అక్క పెళ్లి కూతురు, చెల్లి పెళ్లి కొడుకు

అక్క పెళ్లి కూతురు, చెల్లి పెళ్లి కొడుకు

అక్క పెళ్లి కూతురు, చెల్లి పెళ్లి కొడుకు అని తెలుసుకున్న బెంగళూరులోని కొందరు ప్రజలు వారిని ఒక్క సారైనా చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో సమస్యలు గాలికి వదిలేసి పెళ్లి చేసుకున్న అక్కా, చెల్లిని చూడాలని బెంగళూరులోని విజయనగర, కోరమంగల ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్నారు.

English summary
A day after sections of the media in Karnataka did a story on two young women from Bengaluru who were in a lesbian relationship, one of the women was sacked by the company she was employed in. The LGBT community of Bengaluru came out strongly on Thursday against media reports allegedly misrepresenting the case of a girl living with her aunt as a lesbian marriage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X