• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

బాయ్‌ఫ్రెండ్ ఉన్నా ఏం చేయలేడని అర్థమైంది!: బెంగళూరు బాధితురాలు

|

బెంగళూరు: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇద్దరు యువకుల చేతిలో హింసకు గురైన యువతి తన మనోభావాలను వెల్లడించారు. ఆమె క్రైస్ట్ యూనివర్సిటీలో చదువుతున్నారు. స్త్రీ, పురుష సమానత్వం రావాలంటే అతివాద ధోరణిని అనుసరించడం మాత్రమే ఏకైక మార్గమన్నారు.

బెంగళూరులో యువతిని వేధించిన షాకింగ్ వీడియో: కామాంధులు వీరే..

తాను చిన్నప్పటి నుంచి ఎదిగిన తీరును వివరించారు. విద్యా వ్యవస్థలో రావలసిన మార్పులను కూడా ప్రస్తావించారు.

ఇలా పెరిగాను

ఇలా పెరిగాను

తాను బెంగళూరులో పుట్టానని, ఉదారవాదులైన నా తల్లిదండ్రుల పెంపకంలో పెరిగానని చెప్పారు. తనకు ఓ అన్నయ్య కూడా ఉన్నాడని, ఎనిమిదేళ్ళ వయసు నుంచి తాను స్వతంత్రురాలినేనని చెప్పారు.

బాగా పొద్దు పోయే దాకా నగరంలోని రోడ్ల మీద ఆడుకునే దానిని అన్నారు. తాను ఒక్కదాన్నే డ్యాన్స్ క్లాసులకు వెళ్లేదానిని అని, అయినా తనకు ఈ నగరం మీద ప్రేమతో పాటు భయాందోళనలు కూడా ఉన్నాయని తెలిపారు.

ఎన్నోసార్లు వేధింపులకు గురయ్యా

ఎన్నోసార్లు వేధింపులకు గురయ్యా

తాను తన స్నేహితులతో కలిసి నగరంలో సంచరించేటపుడు వెంటపడి వేధించిన సంఘటనలు వందలాదిగా ఉన్నాయన్నారు. దుర్మార్గుల నుంచి సందేశాలు, ఎన్నో కాల్స్ వస్తుంటాయన్నారు. ఈలుల వేస్తారని, అనుచితంగా మాట్లాడుతారన్నారు.

స్వేచ్ఛగా ఎదగడం నన్ను నేను కాపాడుకోవడాన్ని నేర్పిందన్నారు. అందుకే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో చేరానని, స్థానిక భాషను కూడా నేర్చుకున్నానని చెప్పారు. కానీ కష్టాల్లో ఉన్నపుడు ఇవేవీ ఉపయోగపడటం లేదన్నారు. నగరంలో ఉన్న మగాళ్ళు తమదే పైచేయి అని నమ్ముతారన్నారు.

బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఏం చేయలేడని అర్థమైంది

బాయ్ ఫ్రెండ్ ఉన్నా ఏం చేయలేడని అర్థమైంది

మహిళా డ్రైవర్లపై పురుషులు ఇదే భావంతో ఉంటారని ఇటీవలే ఓ సర్వేలో వెల్లడయిందని, తాను తన కాలేజీ సమీపంలో చిన్న ప్రమాదానికి గురయ్యానని, అప్పుడు చాలామంది మగాళ్లు వచ్చారని, తన చుట్టూ మూగి అదోలా చేసారన్నారు.

వాళ్ళు చూసిందేమీ లేకపోయినా ప్రమాదానికి కారణం నేనేనంటూ తనను నిందించారన్నారు. ఎక్కువమంది మగాళ్ళు చుట్టూ చేరినపుడు బలమైన బాయ్‌ఫ్రెండ్‌ పక్కనే ఉన్నా ఏమీ చేయలేడని తనకు అర్థమైందన్నారు.

మహిళకు మగవాడి సాయం లేకపోతే ఆమెపై జాలి చూపించరని, పోలీసులు కూడా సాయం చేయరన్నారు. ఉద్యోగం మానుకోమని కొందరు సలహా ఇచ్చారన్నారు. ఇలాంటివన్నీ పట్టపగలే జరుగుతుండటంతో రాత్రి వేళల్లో కనీసం ఇంటి బయటికెళ్ళాలంటే మహిళకు ఎంత ధైర్యసాహసాలు అవసరమో ఊహించుకోవచ్చునని చెప్పారు.

శక్తి చూపించాలనుకుంటున్నారు

శక్తి చూపించాలనుకుంటున్నారు

మగవాళ్లు హింసాత్మకంగా మారుతున్నారని, మహిళలు ధైర్యంగా ఉండటాన్ని చూసిన మగాళ్ళు తమ శక్తిని వాళ్ళకు చూపించాలనుకుంటున్నారని, ఇక్కడ సమానత్వం లేదన్నారు. ప్రభుత్వం, మన కుటుంబాలు, ప్రజలు మార్పును విశ్వసించాలన్నారు. దీనికి అడ్డుకట్ట పడాలన్నారు. పురుషులు తమ ఆలోచనా ధోరణి మార్చుకోవాలన్నారు. సమానత్వాన్ని స్థాపించాలంటే రాడికల్ ఫెమినిజంతో ప్రారంభించాలని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. రాడికల్ ఫెమినిజం మాత్రమే ప్రభావం చూపగలుకుతుందని అభిప్రాయపడ్డారు.

English summary
Bengaluru Woman's Attack Was Filmed. Today, 4 Arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X