బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కిలాడీ లేడీ అరెస్టు: రూ. 30 కోట్లకు టోపి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: అనేక మంది ప్రముఖులకు కుచ్చుటోపి పెట్టి తప్పించుకుని తిరుగుతున్న కిలాడీ లేడీని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో గుట్టు చప్పుడు కాకుండా మకాం వేసిన విశాలాక్షి భట్ (42) అనే మహిళను అరెస్టు చేశామని పోలీసు అధికారులు దృవీకరించారు.

దక్షిణ బెంగళూరు నగరంలోని సుబ్రమణ్యపురలో విశాలక్షి భట్ (42) నివాసం ఉంటున్నది. ఈమె హెచ్ డీఎఫ్ సీ లైఫ్ విభాగంలో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ గా ఉద్యోగం చేసేది. అయితే తాను హెచ్ డీఎఫ్ సీ ఇన్సూరెన్స్ విభాగం మేనేజర్ అంటూ పలువురిని పరిచయం చేసుకునింది.

బెంగళూరు నగరంతో సహ వివిద ప్రాంతాల్లోని బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులను పరిచయం చేసుకుంది. మీరు భారీ మొత్తంలో తన ఖాతాలో నగదు డిపాజిట్ చేస్తే నెలకు 5 శాతం వడ్డీ వస్తుందని వారిని నమ్మించింది.

 Bengaluru Woman Vishalakshi Bhat arrested in Delhi

ఈమె మాయమాటలు నమ్మిన పలువురు పెద్ద మొత్తంలో ఆమె అకౌంట్ లో నగదు డిపాజిట్ చేశారు. కన్నడ రెబల్ స్టార్, కర్ణాటక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్ పీఏ శ్రీనివాస్, అంబరీష్ భార్య, నటి సుమలత సోదరి రేణుకాదేవి రూ. 72 లక్షలు విశాలాక్షి అకౌంట్ లో డిపాజిట్ చేశారు.

సొమ్ము డిపాజిట్ చేస్తే 5 శాతం వడ్డీతో పాటు షేర్ ల ద్వారా లాభాలు చెల్లిస్తామని నమ్మించి 60 మంది దగ్గర రూ. 30 కోట్ల వరకూ వసూలు చేసింది. నవంబర్ మొదటి వారంలో తన భార్య కనపడటం లేదని విశాలక్షి భర్త శ్రీకాంత్ భట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు విచారణ చెయ్యగా దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి. అప్పటి నుంచి విశాలక్షి కోసం పోలీసులు గాలిస్తున్నారు. విశాలక్షి ఢిల్లీలో తలదాచుకుందని పసిగట్టిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

విశాలక్షిని బెంగళూరు తీసుకు వచ్చిన తరువాత విచారణ చేస్తే పూర్తి వివరాలు బయటపడుతాయని బెంగళూరు సౌత్ డీసీపీ బీ.ఎస్. లోకేష్ కుమార్ అంటున్నారు. విశాలక్షి డిపాజిట్ చేయించుకున్న సోమ్ము తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులకు మనవి చేస్తున్నారు.

విశాలక్షి మీద బెంగళూరు నగరంలోని జేపీ నగర, మడివాళ, బనశంకరి, మహాలక్ష్మి లేఔట్ పోలీస్ స్టేషన్లలో పలు చీటింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఫిర్యాదులు చేసే వారి సంఖ్య ఎక్కువ అయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.

English summary
The suspect, identified as Vishalakshi Bhat, is alleged to have fraudulently collected money to the tune of Rs 30 crore from her victims who include.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X