బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ, వ్యాపారవేత్తలకు రూ.30కోట్ల టోపీ: లేడీ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: బ్యాంకుల ద్వారా పరిశ్రమలకు రుణాలు ఇప్పిస్తానని, సొమ్మురెట్టింపు చెల్లిస్తానని, ఇన్సూరెన్స్ ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని ప్రచారం చేసుకుని సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు సహా పలువురికి రూ. 30కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన మాయలేడీ విశాలాక్షిభట్‌(42)ను బెంగళూరు పోలీసులు ఢిల్లీలో బుధవారం రాత్రి అరెస్టు చేశారు.

ఢిల్లీలో తలదాచుకుంటున్న ఆమెను బెంగళూరు నుంచి వెళ్ళిన ప్రత్యేక పోలీసు బృందం కాపుగాసి పట్టుకుంది. ఆమెను ఢిల్లీనుంచి తీసుకువచ్చి విచారణ జరుపుతామని సౌత్ డీసీపీ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. హెచడిఎఫ్‌సి బ్యాంక్ ఇన్సూరెన్స విభాగం మేనేజర్‌గా పరిచయం చేసుకుని ఆమె మోసాలకు పాల్పడ్డారు.

జెపినగర్‌లో నివసిస్తున్న ఆమె బెంగళూరు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులను మోసం చేసింది. తన ఖాతాలో సొమ్ము డిపాజిట్‌ చేస్తే 5శాతం ఇన్సూరెన్స వడ్డీ వస్తుందని, షేర్‌ల ద్వారా లాభాలు చెల్లిస్తామని ఈ అవకాశం తన కంపెనీకి మాత్రమే ఉందని ప్రచారం చేసుకున్నారు.

Bengaluru woman who posed as bank executive to swindle crores nabbed in Delhi

విషయాన్ని ఎవరికీ చెప్పవద్దంటూ రూ.30 కోట్ల మేర వసూళ్ళకు పాల్పడ్డారు. నెల రోజుల క్రితం విశాలాక్షి అసలు బండారం బయటపడింది. దీంతో సుమారు సుమారు 60మంది బాధితులు జెపినగర్‌ పోలీస్‌ స్టేషనలో ఫిర్యాదు చేశారు.

కాగా, రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి అంబరీష్‌ పిఎ శ్రీనివాస్‌, సుమలత సోదరి రేణుకాదేవిలు సైతం విశాలాక్షి బాధితులు కావడం గమనార్హం. ఒక్కసారిగా 50మందికిపైగా ఫిర్యాదు చేయడంతో అప్రమత్తమైన పోలీసులు ఆమెకోసం విస్తృత గాలింపు చేపట్టారు.

అప్పటికే, జెపినగర్‌లోని నివాసాన్ని ఖాళీ చేసి విశాలాక్షి పరారైంది. ఈ మేరకు పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలించారు. ఢిల్లీలో తలదాచుకున్నట్లు సమాచారమందడంతో అక్కడికి వెళ్ళిన పోలీసుల బృందం బుధవారం రాత్రి మాయలేడి విశాలాక్షిని అరెస్టు చేసింది.

English summary
A 42-year-old woman, who posed as a senior executive of a major private bank and offered interest rates of five per cent per month on large deposits but disappeared after people made the deposits, has been arrested in Delhi by the Bengaluru police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X