బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రపంచంలో 11 నగరాలకు తాగునీటి సమస్య, బెంగళూరు సెకండ్, బీబీసీ, జార్జ్ ఫైర్. పరువు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రపంచంలోని 11 మహానగరాలకు తాగునీటి సమస్య ఎదురౌతుందని బీబీసీ న్యూస్ బాంబు పేల్చింది. ఐటీ బీటీ సంస్థలకు ప్రసిద్ధి చెందిన బెంగళూరు నగరం రెండో స్థానంలో ఉండటంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురౌతున్నారు. అయితే ఎలాంటి తాగునీటి సమస్య ఎదురుకాదని, ప్రజలకు కావాలసిన నీరు సరఫరా చెయ్యడానికి తాము సిద్దంగా ఉన్నామని బెంగళూరు నగర అభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్ అంటున్నారు. బీబీసీ న్యూస్ కథనంపై మంత్రి కేజే. జార్జ్ మండిపడుతున్నారు.

11 నగరాలు

11 నగరాలు

బీబీసీ న్యూస్ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రపంచంలోని 11 నగరాల్లో 2030 నాటికి తాగునీటి సమస్య ఎదురౌతుందని వివరించింది. భారీ జనసంఖ్య ఉన్న ఈ 11 నగరాల్లో శుద్ది చేసిన నీరు సరఫరా కాక ప్రజలు తీవ్రఇబ్బందులకు గురౌతారని బీబీసీ న్యూస్ తెలిపింది.

బెంగళూరుకు రెండో స్థానం

బెంగళూరుకు రెండో స్థానం

బీబీసీ న్యూస్ కథనం ప్రకారం తాగునీటి సమస్య ఎదురయ్యే 11 నగరాల్లో మొదటి స్థానంలో బ్రెజిల్ లోని సావోపాలో నగరం ఉంది. రెండో స్థానంలో భారత్ లోని బెంగళూరు, తరువాత వరుసగా చైనా రాజధాని బీజింగ్, కైరో, జకర్తా, మాస్కో, ఇస్తాంబూల్, మెక్సికో, లండన్, టోకియో, మియామి నగరాలు ఉన్నాయి.

బెంగళూరు జనసంఖ్య

బెంగళూరు జనసంఖ్య

బెంగళూరులో ప్రతినిత్యం జనసంఖ్య భారీగా పెరిగిపోతుందని, అక్కడి ప్రజలకు తాగునీరు సరఫరా చెయ్యడానికి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీబీసీ న్యూస్ తెలిపింది. బెంగళూరులో ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ అస్థవ్యస్తం అయ్యిందని బీబీసీ న్యూస్ వివరించింది.

50 శాతం నీరు డ్రైనేజ్ లోకి !

50 శాతం నీరు డ్రైనేజ్ లోకి !


బెంగళూరులో అత్యాధునిక ఫ్లబింగ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో 50 శాతం తాగునీరు డ్రైనేజ్ లో కలిసిపోతుందని, తాగునీటి సమస్య ఎదురుకావడానికి ఇదే ప్రధాన కారణం అని, ముందుముందు చాల ఇబ్బందులు ఎదురౌతాయని బీబీసీ న్యూస్ తెలిపింది.

ఒక్క చెరువు నీరు !

ఒక్క చెరువు నీరు !

బెంగళూరు నగరంలోని చెరువుల్లో నీరు కేవలం పరిశ్రమలకు మాత్రం ఉపయోగించడానికి ఉపయోగపడుతున్నాయి. అయితే బెంగళూరులోని ఒక్క చెరువులోని నీరు తాగడానికి, స్నానం చెయ్యడానికి ఉపయోగపడవని, నీటిలో వ్యర్థాలు ఉన్నాయని బీబీసీ న్యూస్ వివరించింది.

తప్పుడు సమాచారం

తప్పుడు సమాచారం


బెంగళూరు నగరంలోని ప్రజలకు ఎలాంటి పరిస్థితుల్లో తాగునీటి సమస్య ఎదురు కాదని బెంగళూరు నగర అభివృద్ది శాఖ మంత్రి కేజే. జార్జ్ అన్నారు. బెంగళూరు నగరంలో ఇప్పటికే కావేరీ నీరు సరఫరా చేస్తున్నామని, కావేరీ నీరు సరఫరా ఐదవ స్టేజ్ పనులు ప్రారంభం అవుతున్నాయని మంత్రి కేజే. జార్జ్ చెప్పారు.

 బెంగళూరు పరువు తీశారు

బెంగళూరు పరువు తీశారు

ఐటీ, బీటీ సంస్థలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బెంగళూరు నగరానికి చెడ్డపేరు తీసుకురావడానికి ఆలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నారని మంత్రి కేజే. జార్జ్ బీబీసీ న్యూస్ పై మండిపడ్డారు. 2033 వరకు బెంగళూరు ప్రజలకు ఎలాంటి తాగునీటి సమస్య ఎదురుకాదని మంత్రి జార్జ్ ధీమా వ్యక్తం చేశారు.

శరావతి నది

శరావతి నది

బెంగళూరుకు ప్రస్తుతం కావేరీ నీరు సరఫరా చేస్తున్నామని, శరావతి నదీ నీరు సరఫరా చెయ్యడానికి పరిశీలిస్తున్నామని, ఆనకట్టలు నిర్మించి, నీరు శుద్ది చేసి త్వరలో తాగునీరు సరఫరా చేస్తామని మంత్రి కేజే. జార్జ్ చెప్పారు. అయితే బీబీసీ న్యూస్ కథనం చూసిన మంత్రి కేజే. జార్జ్ బెంగళూరు జలమండలి అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయంపై చర్చించారు.

English summary
United Nations Organization has warned Bengaluru will go out of water in near future. It will be second city in the world, after capetown of South Africa. Global news Channel BBC reported that Bengaluru may run out of water shortly. But Bengaluru Urban Development minister Kj George denies this charge.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X