వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. లుకేమియా తగ్గించవచ్చంటున్న సైంటిస్టులు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : కేన్సర్ మహమ్మారి ఏటా భారీ సంఖ్యలో అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటోంది. కేన్సర్‌కు కారణమేంటో ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా కనుక్కోలేకపోయినా అందుకు దారితీసే కొన్ని అంశాలను మాత్రం కనిపెట్టారు. తాజాగా బెంగళూరుకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు బోన్ మారో కేన్సర్‌కు సంబంధించి కొత్త అంశాలు కనిపెట్టారు. దీనివల్ల కేన్సర్ చికిత్స సాధ్యమవుతుందని అంటున్నారు.

కారుతో ఢీకొట్టి, ఆరు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...కారుతో ఢీకొట్టి, ఆరు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి...

ఇనామ్‌దార్ నేతృత్వంలో పరిశోధనలు

ఇనామ్‌దార్ నేతృత్వంలో పరిశోధనలు

బెంగళూరులోని జవహర్‌లాల్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ సైంటిఫిక్ రీసెర్చ్‌కి చెందిన మనీషా ఎస్. ఇనామ్‌దార్ నేతృత్వంలో సైంటిస్టులు ఎలుకలపై పరిశోధనలు చేసి కొన్ని విషయాలు కనుగొన్నారు. ఈ వివరాలు అమెరికాకు చెందిన బ్లడ్ మేగజీన్‌లో ప్రచురితమయ్యాయి. అస్రీజ్ అనే మూలకణ ప్రొటీన్ రక్త కణాల ఉత్పత్తిని నిలువరిస్తోందని సైంటిస్టులు గుర్తించారు.

 ప్రోటీన్ మార్పుతో కేన్సర్లు

ప్రోటీన్ మార్పుతో కేన్సర్లు

మూల కణాలను నియంత్రించే ప్రొటీన్ పీ53 మార్పు చెందడం వల్ల 90 శాతం కేన్సర్లు వస్తున్నట్లు ఇనామ్‌‌దార్ నేతృత్వంలోని బృందం కనుగొంది. అయితే ప్రొటీన్ మ్యూటేషన్ వల్ల సోకిన బ్లడ్ కేన్సర్‌లు 11శాతమేనని సైంటిస్టులు నిర్థారణకు వచ్చారు. పీ 53 ప్రోటీన్‌లో పెద్దగా మార్పురాకున్నా ఆస్రీజ్ స్థాయిలు పడిపోయాయని, దీంతో కొత్త కణాలు నియంత్రణ లేకుండా పెరిగిపోయాయని గుర్తించారు.

గార్డియన్ ఆఫ్ జీనోమ్

గార్డియన్ ఆఫ్ జీనోమ్

మూలకణ ప్రోటీన్ అయిన ఆస్రీజ్ పీ 53ని కాపాడుతోందని, అందుకే దీన్ని గార్డియన్ ఆఫ్ జీనోమ్ అని భావించవచ్చని సైంటిస్టుల బృందంలోని సభ్యురాలు సలోని సిన్హా చెప్పారు. ఆస్రీజ్ లేకపోతే పీ53 నాశనమవుతుందని, దీంతో రక్తకణాలు విస్తరించి కేన్సర్‌కు దారితీస్తుందని చెప్పారు. సీ53 ప్రోటీన్‌ని మ్యూటేషన్ చేయకున్నా కొందరు వ్యక్తులు కేన్సర్ బారినపడుతుండటం మిస్టరీగా ఉందని, దానికి తమ అధ్యయనంతో సమాధానం లభిస్తుందని చెప్పారు.

సరికొత్త చికిత్స పద్దతులు

సరికొత్త చికిత్స పద్దతులు

ఇనామ్‌దార్ నేతృత్వంలో జరుగుతున్న పరిశోధనలతో కేన్సర్ చికిత్సలో కొత్త పద్దతులు వస్తాయని, ఫలితంగా ఈ వ్యాధిని నయం చేయడం సాధ్యమవుతుందని అంటున్నారు. మ్యుటేషన్ తర్వాత ఎలుక వయసు పెరిగే కొద్ది రక్తకణాల సంఖ్య ప్లీహం పరిమాణం పెరగడం గుర్తించినట్లు చెప్పారు.

English summary
Bengaluru Team of Indian researchers how close are they heading in finding a cure for cancer? Cancer is one of the most dangerous diseases of our times. We could increase the lifespan of a patient using a judicious application of modern medicine and its increasing knowledge about the disease. An undetected tumor can grow in size until cancerous cells from inside it migrate outside the tumorous to far-flung areas of the body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X