వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియాతో జాగ్రత్త .. అదును చూసి షాక్ ఇస్తుంది : చైనా మాజీ లెఫ్టినెంట్ జనరల్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

డ్రాగన్ కంట్రీ చైనాకు భారతదేశం షాక్ ఇస్తుందా? వాస్తవాధీన రేఖ వద్ద భారీగా యుద్ధ ట్యాంకులను మోహరించిన భారత్ సమరానికి సిద్ధంగా ఉందా? చైనాకు తైవాన్ తో ఘర్షణ తలెత్తితే అమెరికా రంగంలోకి దిగితే, అదే సమయంలో చైనాను ఇండియా దెబ్బ కొట్టనుందా ? డ్రాగన్ కంట్రీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ చేసిన తాజా వ్యాఖ్యలు అవుననే చెబుతున్నాయి.

చైనా దళాలు ఆప్టికల్ ఫైబర్ వేస్తుండటంతో ఇండియా అలెర్ట్

చైనా దళాలు ఆప్టికల్ ఫైబర్ వేస్తుండటంతో ఇండియా అలెర్ట్

డ్రాగన్ కంట్రీ చైనాతో చర్చలు ఇప్పట్లో తెగేలా లేకపోవడంతో భారత్-చైనా దేశాల మధ్య సరిహద్దుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ఇదే సమయంలో భారత్ శీతాకాలంలో సరిహద్దులను రక్షించుకోవడానికి సిద్ధమవుతోంది .ఇప్పటికే భారత యుద్ధ ట్యాంకులు, శతఘ్నులు, వాయుసేన తాజా పరిస్థితుల నేపథ్యంలో సరిహద్దులలో సిద్ధంగా ఉంది. భారత సైన్యం కూడా సరిహద్దుల్లో భారీగా మోహరించింది. చైనా దళాలు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేస్తుండడంతో భారత దళాలు అప్రమత్తమయ్యాయి.

ఇండియాను చైనా దళాలు లైట్ గా తీసుకోవద్దని హెచ్చరించిన చైనా మాజీ లెఫ్టినెంట్ జనరల్

ఇండియాను చైనా దళాలు లైట్ గా తీసుకోవద్దని హెచ్చరించిన చైనా మాజీ లెఫ్టినెంట్ జనరల్

శాటిలైట్ ద్వారా భారతదేశంలోని సమాచారాన్ని ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా తెలుసుకునే యత్నం చేస్తున్న చైనా, భారతదేశంలోని బలహీన ప్రాంతాలను ఆక్రమించే ఆలోచనలో ఉన్నట్లుగా గుర్తించిన భారత ఆర్మీ చైనా దుర్బుద్ధికి ధీటుగా సమాధానం చెప్పడానికి రెడీ అవుతోంది. ఇదే సమయంలో భారతదేశాన్ని చైనా దళాలు తేలిగ్గా తీసుకోవద్దని, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చైనా మాజీ లెఫ్టినెంట్ జనరల్ వాంగ్ హాంగ్ యాంగ్ చైనా దళాలను హెచ్చరించారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా భారత్ షాక్ ఇస్తుంది అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.

చైనా దళాలకు కీలక విషయాలు చెప్పిన వాంగ్ హాంగ్ యాంగ్

చైనా దళాలకు కీలక విషయాలు చెప్పిన వాంగ్ హాంగ్ యాంగ్

భారతదేశాన్ని లైట్ గా తీసుకోవడానికి వీల్లేదని భారత్-చైనాని దెబ్బ కొట్టడానికి వ్యూహాత్మకంగా సన్నాహాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో నాన్ జింగ్ మిలిటరీ రీజియన్ కు డిప్యూటీ కమాండర్ గా పనిచేసిన ఆయన ఇండియా విషయంలో చైనా దళాలకు పలు కీలక విషయాలను చెప్పారు. ఈ విషయాన్ని లిజిన్ అనే రక్షణ సంబంధ వ్యవహారాలు ప్రచురించే సోషల్ మీడియా ఖాతాలో తెలిపినట్లుగా సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పేర్కొంది.

తైవాన్ తో ఘర్షణ జరిగితే అదే అదునుగా ....

తైవాన్ తో ఘర్షణ జరిగితే అదే అదునుగా ....

తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ యుద్ధ సన్నాహాలు చేస్తోందని, చైనా దళాలకు పోటీగా భారత్ కూడా భారీ సంఖ్యలో సైన్యాన్ని తీసుకు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. చైనా తైవాన్ మధ్య ఘర్షణలు చెలరేగి అమెరికా రంగంలోకి దిగితే, అదే అదునుగా చూసుకొని భారత్-చైనా పై దాడి చేసే అవకాశం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. వాస్తవానికి వాస్తవాధీన రేఖ వద్ద రక్షణకు 50 వేల మంది సరిపోతారని కానీ భారత్ దీనికి అదనంగా మరో లక్ష మందిని తరలించింది అని తెలిపారు.

యుద్ధానికి రెడీ అవుతున్న ఇండియా .. ఒకవేళ అదే జరిగితే...

యుద్ధానికి రెడీ అవుతున్న ఇండియా .. ఒకవేళ అదే జరిగితే...

భారత యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లు తాజా పరిణామాలు కనిపిస్తున్నాయని పేర్కొన్న ఆయన శీతాకాలంలో సైన్యం ఉపసంహరణ జరగాల్సి ఉండగా, అందుకు భిన్నంగా భారత సైన్యం భారీగా మోహరించటం పలు అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. ఒకవేళ యుద్ధం మొదలైతే కొన్ని గంటల్లోనే భారత్ సైన్యం చైనాలోకి దూసుకు వచ్చే అవకాశం లేకపోలేదని ఆయన పేర్కొన్నారు.

భారత్-చైనా దేశాల మధ్య ఆరో విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరిగి సంయుక్త ప్రకటన వచ్చిన తర్వాత కూడా భారత్, చైనా దేశాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి.

Recommended Video

Top News Of The Day : India పై China-Pak ల భారీ కుట్ర.. ఉగ్రవాదులను భారత్లోకి పంపించే ప్రయత్నాలు!
ఇండియాను తక్కువగా అంచనా వేస్తే దెబ్బ తింటారన్న మాజీ లెఫ్టినెంట్ జనరల్

ఇండియాను తక్కువగా అంచనా వేస్తే దెబ్బ తింటారన్న మాజీ లెఫ్టినెంట్ జనరల్

చైనా తీరుతో అనుమానంలో ఉన్న భారత్ శీతాకాలంలో పి ఎల్ ఏ దళాలు ఎంత మేరకు వెనక్కు తగ్గుతాయో చూసిన తర్వాత తాము ఏం చేయాలనేది నిర్ణయించుకోవాలని భావిస్తున్నాయి. భారత్ పై దాడి చేయడానికి చైనా, మరో శత్రు దేశమైన పాకిస్తాన్ తో కలిసి రకరకాల మార్గాలలో కుట్రలు చేస్తున్న నేపథ్యంలో భారత్ ఎలాంటి పరిస్థితినైనా ధీటుగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే భారత్ ను తక్కువగా అంచనా వేయొద్దు అంటూ, అదను చూసి షాక్ ఇస్తారని చైనా మాజీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్చరించారు.

English summary
The Chinese former lieutenant general said that India was preparing for war in the wake of the latest developments .He warned that don't under estimate india it will give shock and says be alert to chinese troops .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X