వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్యల్ని వేధించే ఎన్నారై భర్తల్లారా జాగ్రత్త..! తేడా వస్తే తాట తీస్తానంటున్న మోదీ..!!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ/హైదరాబాద్ : ఇండియాలో విలాసవంతంగా వివాహం చేసుకుని అట్టహాసంగా విదేవాలకు తీసుకెళ్లిన తర్వాత బార్యలను వేధించే రోజులకు కాలం చెల్లింది. చచ్చినట్టు భార్యను కంటికి రెప్పలా చూసుకోవాల్సిందే. లేక పోతే పెద్దాయనకు కోపం వస్తుంది. పెద్దాయన ఎవరనుకుంటున్నారా..? ఐతే ఇది చదవండి. ఇక మీదట పెళ్లి చేసుకుని పరాయి విదేశాల్లో భార్యలను వేధించే ఎన్నారై భర్తలకు కేంద్రం చెక్ పెట్టనుంది. ఈ విషయం ప్రధాని మోదీ దృష్టి పెట్టారు. త్వరలో ఇలాంటివారి పని పట్టేలా చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది.

ఇటీవలి కాలంలో ఎన్నారై భర్తలు వదిలేసే భారతీయ భార్యల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని పార్లమెంటు సాక్షిగా విదేశాంగ శాఖ మంత్రి కూడా వెల్లడించారు. ఇలా ఎన్నారై భర్తలు తమను వదిలేశారంటూ ఎంతోమంది మహిళలు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.ఇటీవలి కాలంలో ఈ ఫిర్యాదులు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అధికంగా వస్తున్నాయని, ఈ పరిస్థితిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. పంజాబ్ ఉమెన్ కమిషన్ చైర్ పర్సన్ మనీషా గులాటి గురువారం... ఎన్నారై భర్తలు వదిలేసిన ఎంతో మంది భార్యలు న్యాయం కోసం తమ కార్యాలయం తలుపులు తట్టారని చెప్పారు.

 Beware of NRI husbands who torment wives ..! Modi is the one who makes a difference .. !!

ఈ పరిస్థితిని వివరించేందుకు తాను ప్రధాని మోదీని కలిసినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా సమస్యను తెలుసుకున్న మోదీ.. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి తీసుకోవలసిన చర్యలన్నీ తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు మనీషా తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఇప్పటికే తమకు ఇటువంటి ఫిర్యాదులు వచ్చాయని మోదీ చెప్పారని సమాచారం. కాగా కేంద్రం ఇప్పటికే ఇలాంటివారిపై చర్యలు తీసుకున్న సందర్భాలున్నాయి.

గత ఏడాది - అంతకుముందు సంవత్సరం ఇలాంటి ఎన్నారై భర్తల పాస్ పోర్టులను కేంద్రం రద్దు చేసింది. పాస్ పోర్టు రద్దు సమయంలో సదరు భర్త భారత్ లో ఉంటే కేసు తేలేవరకూ విదేశాలకు వెళ్లడం సాధ్యంకాకుండా చేయాలని.. ఒక వేళ విదేశాల్లో ఉంటే తక్షణమే భారత్ వచ్చేలా నిబంధనలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

English summary
The center will check for NRI husbands who are married and harassed abroad. Prime Minister Modi has paid attention to this issue. It is likely that soon they will take action.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X