social activist anna hazare hunger strike support farmers bharat bandh bharath bandh భారత్ బంద్ అన్నా హజారే రైతులు మద్దతు
రైతులకు మద్దతుగా అన్నా హజారే: ఒక రోజు నిరాహార దీక్ష, రైతు నేతలకు అభినందనలు
డిమాండ్ల సాధన కోసం రైతులు భారత్ బంద్ చేపట్టిన సంగతి తెలిసిందే. వీరికి రాజకీయ పార్టీలు, నేతలు మద్దతు తెలిపారు. అయితే సామాజిక వేత్త అన్నా హజారే కూడా సపోర్ట్ చేశారు. కానీ ఆయన ఒకరోజు నిరహార దీక్షకు పునుకున్నారు. సమస్యల కోసం ఢిల్లీలో ఆందోళనకు దిగిన రైతు నేతలను హజారే అభినందించారు. గత 10 రోజుల నుంచి నిరసన చేపట్టిన హింసాత్మక ఘటనలు జరగలేదని పేర్కొన్నారు. ఇదీ శుభపరిణామం అని హజారే చెప్పారు.
ఢిల్లీలో ప్రారంభమైన రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా వ్యాపించిందని తెలిపారు. దీంతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన చెప్పారు. వీధుల్లోకి వచ్చిన రైతులు తమ లక్ష్యాన్ని ప్రభుత్వానికి చాటారాని పేర్కొన్నారు. సరైన సమయంలో అన్నదాతలు రోడ్డుపైకి వచ్చారని హజారే ఉద్ఘాటించారు. ఇప్పటికే రైతులకు తాను మద్దతు తెలిపానని.. అదీ కొనసాగుతుందని స్పష్టంచేశారు.

వ్యవసాయానికి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని అన్నా హజారే కోరారు. సీఏసీపీకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని కోరారు. ఇదీ విఫలమైతే రైతుల ఆందోళన కొనసాగుతోందని స్పష్టంచేశారు. ఇప్పుడే కాదు ఇదివరకు కూడా హామీలను ఇచ్చింది కానీ నెరవేర్చలేదు అని హజారే పేర్కొన్నారు.