వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భగ్గుమన్న దళిత సంఘాలు: దేశవ్యాప్తంగా ఆందోళనలు, 9మంది మృతి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని సవరిస్తూ తక్షణ అరెస్టులను నిషేధించాలన్న సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా దళిత సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం దళిత సంఘాలన్ని బంద్‌కు పిలుపునివ్వగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఎస్సీ,ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట‌పై భారత్ బంద్: ఉత్తరాదిన ఉద్రిక్తత, ఆందోళనలు, నేడే సమీక్ష పిటిషన్ఎస్సీ,ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట‌పై భారత్ బంద్: ఉత్తరాదిన ఉద్రిక్తత, ఆందోళనలు, నేడే సమీక్ష పిటిషన్

మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్, ఒడిశా లలో హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో మొత్తం తొమ్మిది వ్యక్తులు చనిపోగా.. వేలాదిమంది గాయపడ్డారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని హోంమంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మాయావతి స్పందన:

దేశవ్యాప్తంగా దళిత సంఘాల ఆందోళనలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు. ఆందోళనల్లో కొంతమంది అసాంఘీక శక్తులు ప్రవేశించారని, వారి వల్లే హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుని తొమ్మిది మంది చనిపోయారని, ఆస్తి నష్టం కూడా జరిగిందని ఆమె పేర్కొన్నారు.

పంజాబ్‌లో ఆందోళనలు

పంజాబ్ లోని జలంధర్, రోపర్, బతిందా, ఫిరోజ్ పూర్, అమృత్ సర్ ప్రాంతాల్లో దళిత సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఆందోళనకారులను అణచివేసేందుకు పంజాబ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది.

ఆదివారం సాయంత్రం 5గం. నుంచి సోమవారం రాత్రి 11గం. వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. స్కూల్స్ మూతపడ్డాయి. రవాణా వ్యవస్థ కూడా స్తంభించిపోయింది.

మధ్యప్రదేశ్ సీఎం:

బంద్ ఉద్రిక్తతల నేపథ్యంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. బీజేపీ దళితుల అభివృద్దికి కట్టుబడి ఉందని, ప్రజలంతా శాంతంగా ఉండాలని కోరారు.

మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు మరణించగా.. చాలామంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ విధించారు.

Bharat Bandh LIVE updates: Two killed in Gwalior, one killed in MPs Morena as violence spreads

ఉత్తరప్రదేశ్ సీఎం:

శాంతి భద్రతలకు ఎవరూ భంగం కలిగించవద్దని, దళితుల సంక్షేమం పట్ల బీజేపీ చిత్తశుద్దితో వ్యవహరిస్తుందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.

ఢిల్లీలో:

రాజధాని న్యూఢిల్లీలోని మండి హౌజ్ లో ఆందోళనలు మిన్నంటాయి. జైభీమ్ నినాదాలతో దళిత సంఘాలు రోడ్ల పైకి వచ్చాయి. దీంతో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. బంద్ పిలుపునిచ్చిన తర్వాతే.. తీర్పుపై సమీక్షకు కేంద్రం పిటిషన్ వేసిందని గుర్తుచేశారు. లేదంటే, ఈ విషయాన్ని అసలు పట్టించుకునేదే కాదని అన్నారు.

బీహార్, ఒడిశా..

దళిత సంఘాల ఆందోళన పాట్నాలోనూ ఉద్రిక్తతలకు దారితీసింది. కొంతమంది ఆందోళనకారులు రోడ్లపై ఉన్న కార్లను ధ్వంసం చేశారు. కర్రలతో కార్లను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు సీసీటీవి కెమెరాల్లో రికార్డు అయ్యాయి. రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులు.. వాహనాలను ముందుకు కదలనివ్వలేదు.

బీహార్ లోని ఫోర్బ్స్ గంజ్ రైల్వే జంక్షన్ లోనూ నిరసనకారులు భారీ ఆందోళన చేశారు. ఒడిశా సంబల్ పూర్ లోనూ నిరసనకారులు రైలు పట్టాలపై ఆందోళన చేశారు.

English summary
Dalit organisations in India have called for a nation-wide shutdown in protest of the dilution of the SC/ST act even as the Centre filed a review petition in the Supreme Court on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X