వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్సీ,ఎస్టీ ప్రొటెక్షన్ యాక్ట‌పై భారత్ బంద్: ఉత్తరాదిన ఉద్రిక్తత, ఆందోళనలు, నేడే సమీక్ష పిటిషన్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారిని వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొనేవారి తక్షణ అరెస్టును నిషేధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వును నిరసిస్తూ భారత్‌ బంద్‌కు పిలుపినిచ్చిన నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. పంజాబ్‌, బీహార్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆందోళనల నేపథ్యంలో పంజాబ్‌లో సోమవారం జరగాల్సిన సీబీఎస్‌ఈ పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు సీబీఎస్‌ఈ బోర్డు పంజాబ్‌లో ఈరోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. ఈ విషయాన్ని సీబీఎస్‌ఈ ఓ ప్రకనటలో వెల్లడించింది. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌తో పాటు దేశమంతా పరీక్షలు సాధారణంగానే జరుగుతాయని పేర్కొంది.

పంజాబ్‌లో వాయిదా వేసిన పరీక్షలు తిరిగి నిర్వహించే తేదీ త్వరలో వెల్లడిస్తామని బోర్డు స్పష్టంచేసింది. పలు దళిత సంఘాలు నేడు దేశ వ్యాప్తంగా బంద్‌ చేపడుతున్నాయి. పంజాబ్‌, బిహార్‌, ఒడిశాల్లో బంద్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచారు.

పంజాబ్‌లో 32శాతం ఎస్సీ, ఎస్టీలు ఉండడంతో అక్కడ పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. రాష్ట్రంలో పాఠశాలలు, విద్యాసంస్థలు, కార్యాలయాలు, దుకాణాలు మూసేశారు.

బీహార్‌లో ఆందోళనకారులు జాతీయ, రాష్ట్ర రహదారులను అడ్డగించి రాకపోకలు నిలిపేశారు. పలు చోట్ల రైల్‌రోకో చేపట్టారు. ఒడిశాలో కూడా పలు చోట్ల రైళ్లను అడ్డగించారు. ఉత్తరప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌ పలుచోట్ల పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దీంతో పోలీసులు కొన్ని చోట్ల లాఠీ ఛార్జీ చేశారు. మధ్యప్రదేశ్‌లో పలు చోట్ల దుకాణాలు, పెట్రోల్‌ బంకులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

బీజేపీకి సొంత పార్టీ ఎంపీ హెచ్చరిక

రిజర్వేషన్ల విషయంలో బీజేపీ నాయకురాలు, బహ్రైచ్ ఎంపీ సావిత్రిబాయి పూలే సొంత ప్రభుత్వంపైనే యుద్ధం ప్రకటించారు. రిజర్వేషన్లను తొలిగించడానికి కుట్ర జరుగుతున్నదని, అయినా తమ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చున్నదని విమర్శించారు. ఒకవేళ రిజర్వేషన్లను తొలిగిస్తే రక్తపుటేరు పారుతుందని హెచ్చరించారు. కేంద్రప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆమె ఆదివారం లక్నోలోని కాన్షీరాం స్మృతి వనం నుంచి ఆందోళన యాత్ర ప్రారంభించారు.

సుప్రీంలో సమీక్షపిటిషన్

కాగా, ఎస్సీ, ఎస్టీలపై అకృత్యాల నిరోధక చట్టంలోని నిబంధనలను సడలిస్తూ ఇటీవల జారీ చేసిన ఆదేశాలను పునఃసమీక్షించాలని కేంద్రం సుప్రీంకోర్టును కోరనుంది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ సోమవారం సుప్రీంకోర్టులో సమీక్షా పిటిషన్ దాఖలు చేయనుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఎస్సీ, ఎస్టీల చట్టం కింద దాఖలైన కేసుల్లో నిందితులను పోలీసులు తక్షణం అరెస్ట్ చేసే అవకాశం ఉండేది. ఈ చట్టం కింద బూటకపు కేసులు ఎక్కువగా దాఖలవుతున్నాయని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ కేసుల్లో నిందితులను వెంటనే ఆరెస్ట్ చేయడాన్ని సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. అయితే ఈ చర్య ఎస్సీ,ఎస్టీల రక్షణ చట్టం ఉద్దేశాలను నీరుగార్చుతున్నదని ఎన్డీఏ భాగస్వామ్య ఎంపీలు ప్రధానిని కలిసి చర్చించారు. కాగా, సమీక్షా పిటిషన్ నేపథ్యంలో కొంత ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

English summary
In the wake of the nationwide shutdown call given by Dalits that are protesting against the Supreme Court verdict on the SC/ST (Prevention of Atrocities) Act, a clash broke out between the protestors and police in Jharkhand, Agra on Monday. Trains have been blocked in various states, while shops are also being forced to shut.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X