విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భారత్ బంద్ కారణంగా రెండేళ్ల చిన్నారి మృతి, మీరేం చెబుతారు: రాహుల్‌కు కేంద్రమంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుదలపై కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలు సోమవారం నిరసనలు చేపట్టాయి. దీనిపై కేంద్రమంత్రి రవిశంకర ప్రసాద్ స్పందించారు. బంద్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో బీహార్‌లో రెండేళ్ల బాలిక సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయిందని వాపోయారు.

దీనిపై రవిశంకర్ ప్రసాద్ విపక్షాల చర్యను దుయ్యబట్టారు. ఆమె మరణానికి బాధ్యులు ఎవరని కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీని నిలదీశారు. రెండేళ్ల చిన్నారిని జెహనాబాద్‌లోని సివిల్ ఆసుపత్రికి తరలించాలని ప్రయత్నించగా బంద్ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో సాధ్యం కాలేదు. బంద్ లేకపోయి ఉంటే తమ బిడ్డ బతికుండేదని ఆ తల్లిదండ్రులు వాపోయారు.

నేను గిన్నెలు శుభ్రం చేస్తా: కేటీఆర్‌కు మద్దతుగా ఫోటోలు పెడుతూ నెటిజన్ల ఆగ్రహంనేను గిన్నెలు శుభ్రం చేస్తా: కేటీఆర్‌కు మద్దతుగా ఫోటోలు పెడుతూ నెటిజన్ల ఆగ్రహం

Bharat Bandh: Ravi Shankar Prasad challenges Manmohan to debate in Parliament over economy

'దేశంలో భయాందోళనలతో కూడిన వాతావరణం ఏర్పడటానికి కారకులవుతున్నారు. ఆ చిన్నారి మరణానికి ఎవరు బాధ్యులు?. దీనిపై కాంగ్రెస్‌ సమాధానం చెప్పాలి' అని రవి శంకర్ ప్రసాద్ కాంగ్రెస్‌ పార్టీ మీద మండిపడ్డారు.

మన్మోహన్‌కు సవాల్

రవిశంకర ప్రసాద్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను సవాల్ చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు. పార్లమెంటులో చర్చిద్దామా అన్నారు. దేశానికి కావాల్సింది మోడీ ప్రభుత్వం ఏదీ చేయలేదని చెప్పడంపై రవిశంకర ప్రసాద్ మండిపడ్డారు.

English summary
Union Law Minister Ravi Shankar Prasad on Monday challenged former Prime Minister Manmohan Singh for a full fledged debate in Parliament on the state of economy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X