వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే భారత్ బంద్: డజనుకు పైగా కార్మిక సంఘాలు..25 మందికి పైగా ఉద్యోగులు..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీపై దండెత్తాయి ప్రతిపక్షాలు. కార్మిక సంఘాలతో కలిసి దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. బుధవారం భారత్ బంద్ ను నిర్వహించున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన కార్మిక, ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెను నిర్వహించ తలపెట్టాయి. 25 కోట్ల మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొనబోతున్నట్లు అంచనా.

డజనుకుపైగా కార్మిక సంఘాలు..

డజనుకుపైగా కార్మిక సంఘాలు..

ఐఎన్ టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సేవా, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ వంటి కార్మిక సంఘాలతో పాటు వివిధ రంగాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్న స్వతంత్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సమాఖ్యలు, అసోసియేషన్లు భారత్ బంద్ లో పాల్గొననున్నాయి. బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించే అవకాశాలు లేకపోలేదు.

బ్యాంకింగ్, రవాణా రంగాలపై పెను ప్రభావం..

బ్యాంకింగ్, రవాణా రంగాలపై పెను ప్రభావం..

భారత్ బంద్ ప్రభావం.. ప్రత్యేకించి బ్యాంకింగ్, రవాణా రంగాలపై తీవ్రంగా ఉండే అవకాశాలు లేకపోలేదు. బ్యాంకింగ్ రంగంలో ఉన్న కార్మిక, ఉద్యోగ సంఘాలతో కూడిన బ్యాంకింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఈఎఫ్ఐ) భారత్ బంద్ కు మద్దతు ఇచ్చింది. ఈ ఫెడరేషన్ లో సుమారు పది వరకు వివిధ అసోసియేషన్లు పని చేస్తున్నాయి. భారత్ బంద్ సందర్భంగా ఆయా సంఘాల ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించబోతున్నారు.

విద్యార్థి సంఘాల మద్దతు..

విద్యార్థి సంఘాల మద్దతు..

సాధారణంగా కార్మిక, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపు పట్ల విద్యార్థి సంఘాలు పెద్దగా స్పందించవు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో విద్యార్థి సంఘాలు కూడా భారత్ బంద్ కు మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. వామపక్ష పార్టీల అనుబంధ విద్యార్థి సంఘం స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) ప్రతినిధులు భారత్ బంద్ కు మద్దతు ప్రకటించారు.

విద్యార్థులపై దాడులకు నిరసనగా..

విద్యార్థులపై దాడులకు నిరసనగా..

జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యూ) విద్యార్థులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం, అంతకుముందు- జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీల్లో ఢిల్లీ పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి విద్యార్థులపై దౌర్జన్యానికి పాల్పడటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాల పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో కార్మిక సంఘాలు భారత్ బంద్ కు పిలుపునివ్వడాన్ని అనుకూలంగా మార్చుకోనున్నాయి. బంద్ లో పాల్గొని కేంద్రానికి సత్తా చాటాలని భావిస్తున్నాయి.

English summary
Ten central trade unions on Monday said around 25 crore people will participate in a nationwide strike on January 8 to protest against the government's "anti-people" policies. Trade unions INTUC, AITUC, HMS, CITU, AIUTUC, TUCC, SEWA, AICCTU, LPF, UTUC along with various sectoral independent federations and associations had adopted a declaration in September last to go on a nationwide strike on January 8, 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X