వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపు భారత్ బంద్: పెట్రోల్ ,డీజిల్ ధరలు, జీఎస్టీ , ఈ వే బిల్స్ కు వ్యతిరేకంగా బంద్ లో 40 వేల వాణిజ్య సంఘాలు

|
Google Oneindia TeluguNews

దేశంలో నియంత్రణ లేకుండా విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు , జీఎస్టీ , ఎలక్ట్రానిక్ వే బిల్ లకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ నెల 26 వ తేదీన దేశ వ్యాప్త బంద్ కు అఖిల భారత వ్యాపార సమాఖ్య పిలుపునిచ్చింది. దేశంలోని ఎనిమిది కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న దాదాపు 40, 000 వాణిజ్య సంఘాలు ఫిబ్రవరి 26 న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సిఐఐటి) చే నిర్వహించబడే భారత్ బంద్ పిలుపులో భాగంగా సరుకు, సేవల పన్ను (జిఎస్‌టి) నిబంధనలను సమీక్షించాలని డిమాండ్ చేసింది.

కొత్త ఈ వే బిల్లుల రద్దుకు డిమాండ్ చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్

కొత్త ఈ వే బిల్లుల రద్దుకు డిమాండ్ చేస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్

వ్యవస్థీకృత రహదారి రవాణా సంస్థల అత్యున్నత సంస్థ ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా కొత్త ఇ-వే బిల్లును రద్దు చేయాలని , కొన్ని నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ బంద్ లో పాల్గొనాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఇ-ఇన్వాయిస్‌కు ఫాస్ట్ ట్యాగ్ కనెక్టివిటీని ఉపయోగించడం ద్వారా ఇ-వే బిల్లును రద్దు చేసి వాహనాలను ట్రాక్ చేయాలని మరియు రవాణాకు ఎప్పుడైనా అనుమతి ఇవ్వాలని , రవాణాదారులకు జరిమానాను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.

పెట్రోల్ , డీజిల్ ధరల తగ్గింపుకు డిమాండ్ .. దేశమంతా ఒకే విధంగా ఉండాలని విజ్ఞప్తి

పెట్రోల్ , డీజిల్ ధరల తగ్గింపుకు డిమాండ్ .. దేశమంతా ఒకే విధంగా ఉండాలని విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఒకే విధంగా మార్చాలని ప్రభుత్వాన్ని కోరింది. బంద్ కు మద్దతునిస్తూ, ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య మాట్లాడుతూ, "ఇంధన ధరల పెరుగుదల మరియు కొత్త ఈ వేబిల్ రద్దు కోసం నిరసన తెలియజేస్తూ అన్ని రాష్ట్ర స్థాయి-రవాణా సంఘాలు ఆల్ ఇండియా ట్రాన్స్పోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి తమ మద్దతును ధృవీకరించాయి. "కొత్తగా ప్రవేశపెట్టిన ఇ-ఇన్వాయిస్ పన్ను ఎగవేతను నివారించడానికి సరిపోతుంది కాబట్టి ఈ -వే బిల్లును రద్దు చేయాలని ఆల్ ఇండియా ట్రాన్స్ పోర్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోరుతోంది. డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని కోరింది .

జీఎస్టీ నిబంధనల విషయంలో అభ్యంతరాలు .. ప్రధానికి లేఖ

జీఎస్టీ నిబంధనల విషయంలో అభ్యంతరాలు .. ప్రధానికి లేఖ

జిఎస్‌టి నిర్మాణాన్ని సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి సీనియర్ అధికారులు, సిఐఐటి ప్రతినిధులు మరియు స్వతంత్ర పన్ను నిపుణులతో కూడిన కేంద్ర స్థాయిలో "ప్రత్యేక వర్కింగ్ గ్రూప్" ను ఏర్పాటు చేయాలని సిఐఐటి ప్రధానమంత్రికి రాసిన లేఖలో కోరింది . సున్నితమైన జిఎస్‌టి అమలును పర్యవేక్షించడానికి మరియు పన్ను బేస్ విస్తరించడానికి మరియు ఆదాయాన్ని పెంచడానికి చర్యలు తీసుకోవడానికి ప్రతి జిల్లాలో "జిల్లా జిఎస్‌టి వర్కింగ్ గ్రూప్" ను ఏర్పాటు చేయాలని సూచించింది.

బంద్ లో పాల్గొననున్న 40,000 వ్యాపార సంఘాలు

బంద్ లో పాల్గొననున్న 40,000 వ్యాపార సంఘాలు

దేశ వ్యాప్తంగా 8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40,000 సంఘాలు అఖిలభారత వ్యాపార సమాఖ్య కింద ఉన్నాయి. అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం(ఐట్వా) కూడా శుక్రవారం రోడ్లను దిగ్బంధిస్తామని, బంద్ లో పాల్గొంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. దేశంలో ఇటీవ‌ల పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు వ‌ర‌స‌గా పెరిగిపోతున్నాయి. వాహ‌న‌దారుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్య‌క్త‌మతుంది. వర్తక వాణిజ్య వర్గాలు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయితే రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ ధర‌ల పెరుగుద‌ల‌కు కాస్త బ్రేక్ ప‌డినా ఆందోళన మాత్రం కొనసాగుతుంది .రేపు భారత్ బంద్ కొనసాగనుంది.

English summary
Bharat bandh call by Confederation of All India Traders (CAIT) on February 26, demanding a review of the provisions of the goods and services tax (GST) regime, new E-Way Bill and fuel prices hike .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X