• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఈనెల 20లోగా కొవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్ డేటా బయటికి:కేంద్రం క్లారిటీ,భారత్ బయో భిన్న ప్రకటన

|

వ్యాక్సిన్ సమర్థత, క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను పరిశీలించకుండానే భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాకు అనుమతులిచ్చారనే విమర్శలు, ఇదే టీకాకు అమెరికా ఎఫ్‌డీఏ అనుమతి నిరాకరణ, సీరం వారి కొవిషీల్డ్ కంటే కొవాగ్జిన్ సమర్థత తక్కువనే వాదోపవాదాల నడుమ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొవాగ్జిన్ టీకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి డేటా ఈనెల 20లోగా వెల్లడవుతుందని కేంద్రం పేర్కొంది.

  Vaccination Boost Natural Immunity దీర్ఘకాలం పాటు మనిషి శరీరంలో | COVID 19 Study || Oneindia Telugu

  సజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనాసజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనా

  నీతి ఆయోగ్ ఆరోగ్య వ్యవహారాల సభ్యుడు డాక్టర్ వీకే పాల్ శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకా ట్రయల్ డేటా ఈనెల 20లోగా అందాల్సి ఉందని, క్లినికల్ ట్రయల్స్ ఫలితాల డేటా తొలుత సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO)కు చేరుతుందని, ఆ సంస్ధ పరిశీలన అనంతరమే ప్రచురణ కోసం డేటాను మీడియాకు విడుదల చేస్తామని పాల్ తెలిపారు.

   Bharat Biotechs Covaxin Third phase trial data to be released by June 20 says Govt

  భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాకు అమెరికాలో భాగస్వామిగా ఉన్న ఆక్యుజెన్ ఫార్మా సంస్థ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా, అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) అధికారులు నిరాకరించారు. టీకా పనితీరును నిర్ధారించే క్లినికల్ ట్రయల్స్ డేటాపై సమగ్ర సమాచారం లేనందునే కొవాగ్జిన్ టీకాను ఎఫ్‌డీఏ నిరాకరిచింది. మరి భారత్ లో మాత్రం ట్రయలల్స్ డేటా లేకున్నా అనుమతులు లభించడంపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వివరణ ఇచ్చారు. టీకాల విషయంలో ఒక్కో దేశం ఒక్కో పాలసీని, తనకు అనుకూలమైన నిర్ణయాలను తీసుకుంటుందని, అమెరికాకు తనదైన సొంత వ్యవస్థ, పరిమితులు పెట్టుకుంది కాబట్టే ఇలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా,

  cji nv ramana: జగన్ అలా, కేసీఆర్ ఇలా -గవర్నర్, సీఎం అపూర్వ స్వాగతం -3రోజులు హైదరాబాద్ లోనేcji nv ramana: జగన్ అలా, కేసీఆర్ ఇలా -గవర్నర్, సీఎం అపూర్వ స్వాగతం -3రోజులు హైదరాబాద్ లోనే

  మూడో దశ క్లినికల్ ట్రయల్స్ డేటా వెల్లడికి సంబంధించి భారత్ బయోటెక్ ప్రకటనకు కేంద్రం తాజా ప్రకటన భిన్నంగా ఉండటం గమనార్హం. కొవాగ్జిన్ ట్రయల్స్ డేటాను జులై నాటికి అందుబాటులో ఉంచుతామని ఆ సంస్థ ప్రకటన చేయగా, 24 గంటలు తిరక్కుండానే కేంద్రం.. సదరు డేటా జూన్ 20 లోపే వెల్లడికానుందని చెప్పింది. మరోవైపు భారత్ బయోటెక్.. కొవాగ్జిన్ టీకాపై నాలుగో దశ క్లినికల్ ట్రయల్స్ ను సైతం త్వరలోనే ప్రారంభించనుంది.

  English summary
  Months after the Centre gave the approval for using Covaxin to vaccinate people in India, the government on Friday said that Covaxin's third phase trial data will be released by June 20. The new announcement came a day after Covaxin manufacturer Bharat Biotech said that the data will be made public by July. "Covaxin third-phase data and follow-up studies should be available in a few days," VK Paul said during the press conference. Bharat Biotech has hinted that they will apply for full licensure of Covaxin when all the data is available to them.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X