వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ మాతా మందిర్: ఇక్కడికి వెళ్తే అఖండ భారత్ కనిపిస్తుంది

By Srinivas
|
Google Oneindia TeluguNews

వారణాసి: పవిత్ర పుణ్యక్షేత్రం కాశిలో భారతమాత ఆలయం ఉంది. ఏ ఆలయంలోనైనా లేదా ప్రార్థనాలయంలోనైనా అక్కడ దేవుడు లేదా దేవత ఉంటారు. కానీ ఇక్కడి ఆలయానికి వెళ్తే ఏ దైవమూ కనిపించదు. దేశభక్తిని నింపేలా అద్భుతం సాక్షాత్కరిస్తుంది.

భారతమాతను కళ్లెదుట నిలిపేందుకు ప్రముఖ స్వతంత్ర్య సమరయోధుడు శివప్రసాద్ గుప్తా దీని కోసం కృషి చేశారు. ఇక్కడ అఖండ భారత్ ఉంటుంది. మహాత్మా గాంధీ విద్యాపీఠం ఆవరణలో శివప్రసాద్ గుప్తా అనే సమరయోధుడు ఈ ఆలయాన్ని నిర్మించారు.

1918 నుంచి 1924 మధ్య వరకు దీని నిర్మాణం సాగింది. ఆ తర్వాత పన్నెండేళ్లకు మహాత్మా గాంధీ ఈ ఆలయాన్ని ఆవిష్కరించారు. భారత్ దేశం చిత్రపటం అంటే మనకు ఉత్తరాన హిమాలయాలు, ఓ వైపు పాకిస్తాన్, మరోవైపు చైనా, బంగ్లాదేశ్ కనిపిస్తాయి.

Bharat Mata Mandir, a unique temple with a map of undivided India

కానీ అఖండ భారత్ అంటే ప్రాచీన భారతం. ఆప్గనిస్తాన్‌ను గాంధార దేశంగా భావిస్తారు. ఇలా ఆఫ్గనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్‌లతో కూడిన భారత్‌ను అఖండ భారత్ అంటారు. ఇది ప్రాచీన భారతం అసలు స్వరూపం.

కాశీలో ఉన్న ఈ ఆళయంలో అడుగు పెడితే భారతమాత చిత్రపటం కళ్లముందు కనిపిస్తుంది. మార్బుల్‌తో అవిభాజ్య భారతం చూడవచ్చు. రాజస్థాన్‌లో దొరికే అరుదైన మక్రానా మార్బుల్‌తో భారత చిత్రపటాన్ని రూపొందించారు. దీనికి పలువురు నేతలు కూడా నిధులు విరాళంగా ఇచ్చారు.

English summary
A unique temple in Varanasi Bharat Mata Mandir displays the map of undivided India. The temple was built by freedom fighter Shiv Prasad Gupta between 1918-1924. The map has been carved out of 762 blocks of makrana marble and shows Afghanistan, Pakistan, Myanmar and Bangladesh as part of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X