వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాలవీయకు భారతరత్న: సింధుతో సహా 7గురు తెలుగువారికి పద్మశ్రీ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: స్వాతంత్య్ర సమరయోధుడు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు మదన్‌మోహన్ మాలవీయకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను సోమవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. మాలవీయ మరణించిన 68ఏళ్ల తర్వాత ప్రకటించిన ఈ అవార్డును రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో మాలవీయ కుటుంబసభ్యులకు అందజేశారు.

మాలవీయ మనుమరాళ్లు హేమ్‌శర్మ, సరస్వతిశర్మ, మనుమలు ప్రేమ్‌ధర్ మాలవీయ, గిరిధర్ మాలవీయ ఈ అవార్డును అందుకున్నారు. ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతోపాటు పలువురు ఇతర సీనియర్ మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మ అవార్డులను కూడా రాష్ట్రపతి ప్రదానం చేశారు.

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ, పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్, సంస్కృత వ్యాకరణ పండితుడు జగద్గురు స్వామి రామభద్రాచార్యలకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును అందించారు. వీరితోపాటు 34 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు.

బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, గేయ రచయిత ప్రసూన్ జోషి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ రణ్‌దీప్ గులేరియా, చాచా చౌదరి కార్టూన్ సృష్టికర్త ప్రాణ్‌కుమార్ శర్మ (మరణానంతరం), హాకీ స్టార్ సర్దార్‌సింగ్, ఎవరెస్టును అధిరోహించిన వికలాంగురాలు అరుణిమా సిన్హా , చువాంగ్ నోర్ఫెల్, నరేశ్ బేడి, ఎన్ పురుషోత్తమ మాలవ్య, తారక్ జానుభాయ్ మెహతా తదితరులు సోమవారం పద్మశ్రీ అవార్డును అందున్నారు.

వీరితోపాటు 12 మంది పద్మభూషణ్ అవార్డు విజేతలు రాష్ట్రపతి ప్రణబ్ చేతులమీదుగా పురస్కారాలు అందుకున్నారు. వీరిలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే, జర్నలిస్టులు స్వపన్‌దాస్ గుప్తా, రజత్‌ శర్మ, సైచిరో మిసుమి, డేవిడ్ ఫ్రాలీ, ఎన్ గోపాలస్వామి, సత్‌పాల్‌, సుధా రఘునాథన్, అశోక్ సేథి తదితరులు ఉన్నారు.

ఏడుగురు తెలుగువారికి పద్మశ్రీ

ఈ ఏడాది ఏడుగురు తెలుగువారిని పద్మశ్రీ అవార్డులకు ఎంపికచేయగా.. వారిలో ప్రముఖ వైద్యురాలు మంజుల అనగాని, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు, కళారంగానికి చెందిన అవసరాల కన్యాకుమారి, ప్రవాస భారతీయుడు డాక్టర్ రఘురామ్ పిళ్లారిశెట్టి సోమవారం పురస్కారాలు అందుకున్నారు. సినీనటుడు కోట శ్రీనివాసరావు, మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, ఎన్నారై డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇంకా అవార్డు అందుకోవాల్సినవారిలో ఉన్నారు.

రాజత్ శర్మకు పద్మభూషణ్

రాజత్ శర్మకు పద్మభూషణ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న రాజత్ శర్మ,

మాలవీయకు భారతరత్న

మాలవీయకు భారతరత్న

స్వాతంత్య్ర సమరయోధుడు, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడు మదన్‌మోహన్ మాలవీయకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను సోమవారం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రదానం చేశారు. మాలవీయ మనుమరాళ్లు హేమ్‌శర్మ, సరస్వతిశర్మ, మనుమలు ప్రేమ్‌ధర్ మాలవీయ, గిరిధర్ మాలవీయ ఈ అవార్డును అందుకున్నారు.

జగద్గురు స్వామి రామభద్రాచార్యకు పద్మవిభూషణ్

జగద్గురు స్వామి రామభద్రాచార్యకు పద్మవిభూషణ్

సంస్కృత వ్యాకరణ పండితుడు జగద్గురు స్వామి రామభద్రాచార్యకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డును రాష్ట్రపతి అందించారు.

పివి సింధుకు పద్మశ్రీ

పివి సింధుకు పద్మశ్రీ

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు.

సర్దార్ సింగ్‌కు పద్మశ్రీ

సర్దార్ సింగ్‌కు పద్మశ్రీ

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న హాకీ సర్దార్ సింగ్.

తారక్ జానూభాయి మెహతాకు పద్మశ్రీ

తారక్ జానూభాయి మెహతాకు పద్మశ్రీ

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంటున్న తారక్ జానూభాయి మెహతా.

సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్‌కు పద్మవిభూషణ్

సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్‌కు పద్మవిభూషణ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకుంటున్న పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్ బాదల్.

సైచిరో మిసుమికి పద్మభూషణ్

సైచిరో మిసుమికి పద్మభూషణ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న సైచిరో మిసుమి.

లాల్‌కృష్ణ అద్వానీకి పద్మ విభూషణ్

లాల్‌కృష్ణ అద్వానీకి పద్మ విభూషణ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు అందుకుంటున్న బిజెపి సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ.

సుధా రఘునాథన్‌కు పద్మభూషణ్

సుధా రఘునాథన్‌కు పద్మభూషణ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న సుధా రఘునాథన్.

సత్‌పాల్‌కు పద్మభూషణ్

సత్‌పాల్‌కు పద్మభూషణ్

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్న సత్‌పాల్‌.

అవార్డుల కార్యక్రమం

అవార్డుల కార్యక్రమం

రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధాని నరేంద్ర మోడీ, అవార్డు గ్రహీతలు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి రాష్ట్రపతి గతవారం ఆయన నివాసం వద్దకు వెళ్లి భారతరత్న అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 109 మందికి పద్మ అవార్డులను ప్రకటించగా శనివారం 43 మందికి ప్రదానం చేశారు. మరో ఆరుగురు హాజరుకాలేదు. మిగిలిన 60 మందికి ఏప్రిల్ 8న ప్రదానం చేసే అవకాశమున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

English summary
Noted educationist and freedom fighter Madan Mohan Malviya was on Monday posthumously conferred the Bharat Ratna, country's highest civilian award, by President Pranab Mukherjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X