వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ మరో ముందడుగు ... ఇక నుండి ఏకే 47 మేడిన్ ఇండియా

|
Google Oneindia TeluguNews

ఇండియా మరో ముందడుగు వేసింది. మన రక్షణారంగం మరింత పటిష్టం కాబోతుంది. అత్యంత శక్తివంతమైన ఏకే-47 రైఫిల్స్ భారత్ లో తయారు చేసే ప్రతిపాదనకు కేంద్ర సర్కార్ పచ్చజెండా ఊపింది . రష్యాకు చెందిన ఏకే-47 రైఫిల్స్ తయారి సంస్థ కలష్నికోవా భారతీయ కంపెనీల భాగస్వామ్యంతో ఇక్కడ రైఫిల్స్ తయారు చేసే ప్రాజెక్టు సంస్థను ప్రారంభించడానికి 2018 నుండే అడుగులు వేస్తోంది. ఈ విషయంపై భారతీయ కంపెనీలతో ఇంతకాలంగా సాగిస్తున్న చర్చలు ఇప్పుడు సత్ఫలితాలను ఇవ్వబోతున్నాయి. స్థానిక భాగస్వామ్యంతో, సాంకేతికతను పంచుకునేందుకు సంసిద్దత వ్యక్తం చేసిన కలప్నికోవ్ ఇప్పుడు భారత్ లో ఏకే-47 తయారీ కేంద్రాన్ని ప్రారంభించబోతోంది. ఇది భారతదేశంలో రక్షణా రంగంలోని ఒక బిగ్ డెవలప్ మెంట్ అని చెప్పవచ్చు.

ఇక నుండి ఏకే-47 మేడిన్ ఇండియా .. అమేథీలో ప్లాంట్

ఇకనుండి ఏకే-47 మేడిన్ ఇండియా అని సగర్వంగా చెప్పవచ్చు. శక్తివంతమైన కలష్నికోవా రైఫిల్స్ తయారీ కేంద్రాన్ని భారత్ లో ఏర్పాటు చేయడానికి మోడీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఇక ఈ ప్లాంట్ ను మోడీ సర్కార్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథీలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఈ తయారీ ప్రపోజల్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమేథీ జిల్లాలోని కోర్వా సిటీలోని ఫ్లాంట్ లో రష్యా జాయింట్ వెంచర్ సంస్థ, ఆర్డ్ నాన్స్ ఫ్యాక్టరీ బోర్డు సంయుక్తంగా దాదాపు 7.5 లక్షల దాడి రైఫిల్స్ తయారీ చేయనున్నాయి.అంతేకాకుండా ఫాస్ట్-ట్రాక్ విధానాల కింద అమెరికా నుంచి 72వేల సిగ్ సౌర్ 716 దాడి రైఫిల్స్ ను పొందేందుకు కాంట్రాక్ట్ పై భారత్ సంతకం చేసింది. దాదాపు 3వేల600 కిలోమీటర్ల పొడవైన చైనా బోర్డర్ లో ఉన్న దళాలు 72వేల సిగ్ సౌర్ 716 దాడి రైఫిల్స్ ను వాడనున్నాయి.

Bharat stepping forward ... from now onwards AK-47 made in India

ఫిబ్రవరి 28నఈ ప్రాజెక్ట్ ప్రారంభించనున్న ప్రధాని మోడీ

ఫిబ్రవరి 28న ప్రధాని నరేంద్రమోడీ ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వం రైఫిల్స్ తయారీకి 100 శాతం లోకల్ కంటెంట్ ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.ఈ జాయింట్ వెంచర్ లో మెజార్టీ స్టేక్ హోల్డర్ గా 50.5 శాతంతోఆర్డ్ నాన్స్ ఫ్యాక్టరీ బోర్డు ఉండగా, రష్యా 49.5శాతం కలిగా ఉంది. 7.62 x 39 mm క్యాలిబర్ AK-203 గన్స్ కోర్వా ఫ్లాంట్ అందిచనుంది. ఫేమస్ AK-47రైఫిల్స్ కి సంబంధించిన డీల్ కూడా శుక్రవారం ఫిబ్రవరి-15,2019 దీనికి లింక్ అయ్యే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇండియాలో ఏకే 47 గన్స్ తయారీకి ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుండగా ఇంతకాలానికి ఏకే 47 మేడిన్ ఇండియా అని చెప్పే అవకాశం కలగబోతోంది. దీంతో మన రక్షణ రంగం సైతం ఏకే 47 గన్స్ వినియోగంలో ముందు ఉండబోతోంది.

English summary
As part of the Make in India initiative Prime Minister Narendra Modi is likely to inaugurate a new factory in Korwa, near Amethi, in Uttar Pradesh, on February 28 for the manufacture of Russian designed AK-47/203 rifles in India.The plant will initially manufacture 7.47 lakh rifles for the Armed forces and then, for the Central police forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X