• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
LIVE

Bharath Bandh:ముగిసిన భారత్ బంద్.. కొన్ని చోట్ల తప్ప చాలా చోట్ల కనిపించని బంద్ ప్రభావం

|

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేకించి- వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు రోజుల తరబడి దేశ రాజధాని శివార్లలో నిరసన దీక్షలకు కూర్చున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని పట్టుబడుతున్నారు. రైతుల సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు నిర్వహిస్తోన్న చర్చలు మాత్రం కొలిక్కి రావట్లేదు. ఇప్పటికే ఎనిమిది దఫాలుగా కేంద్ర మంత్రులు-రైతు సంఘాల ప్రతినిధుల మధ్య చర్చలు కొనసాగాయి.

తాము చేసిన కీలక సూచలనకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం అంగీకరించకపోవడం వల్లే చర్చల్లో ప్రతిష్ఠంభన ఏర్పడుతోందని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. కేంద్రం వైఖరిని ఎండగడుతూ.. మరింత ఒత్తిడిని తీసుకుని రావడానికి భారత్ బంద్‌ను తలపెట్టారు. ఈ బంద్ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాబోతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది.

ఇక ఈ రోజు జరుగుతున్న భారత్‌ బంద్ పై మినిట్-టూ-మినిట్ అప్‌డేట్స్ మీకోసం

BharatBandh: Farmers to protest peacefully from 11am to 3Pm live updates

Newest First Oldest First
12:55 AM, 9 Dec
బుధవారం రైతు సంఘాల నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తామని రైతు నేత హనన్ మోన్నా తెలిపారు.
12:54 AM, 9 Dec
ఢిల్లీలోని ఏసీఏఆర్ ఆఫీసులో రైతు సంఘాల నేతలతో కేంద్ర మంత్రి అమిత్ షా, నరేంద్ర తోమర్ జరిపిన చర్యలు చివరికి విఫలం అయ్యాయి. ఆరో దఫా చర్చల అజెండా ఖరారులో ఎవరికి వాళ్లే అన్నట్లుగా వ్యవహరించడంతో చివరికి బుధవారం నాటి చర్చలే రద్దయిపోయాయి. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకునే ప్రసక్తేలేదని అమిత్ షా తేల్చిచప్పడంతో రైతులు కూడా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.
11:25 PM, 8 Dec
రైతు సంఘాలతో అమిత్ షా ఒక్కరే మాట్లాడుతారని తొలుత ప్రచారంకాగా, చివరి నిమిషంలో తోమర్ కూడా జాయిన్ అయ్యారు.
11:24 PM, 8 Dec
రైతుల నిరసనలు మొదలైనప్పటి నుంచి మీడియాకు దూరంగా ఉంటోన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మంగళవారం రాత్రి సడెన్ గా ఐసీఏఆర్ ఆఫీసు వద్ద ప్రత్యక్షమయ్యారు.
10:35 PM, 8 Dec
ఆరో దఫా చర్చల అజెండాను ఖరారు చేసేందుకుగానూ రైతు సంఘాల నేతలు మంగళవారం రాత్రి కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
9:33 PM, 8 Dec
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రైతు సంఘాల నేతలు మంగళవారం రాత్రి ప్రారంభమైంది.
8:29 PM, 8 Dec
తమ ప్రజల సమస్యలపై చర్చించేందుకు తాము కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అవుతున్నామని రైతు సంఘం నేత తెలిపారు.
7:45 PM, 8 Dec
తాను సీఎంగా కాకుండా సామాన్యుడిగానే రైతులకు మద్దతు తెలిపానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
4:56 PM, 8 Dec
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను హౌజ్ అరెస్టు చేశారని పేర్కొంటూ... ఆయన నివాసం వెలుపల నిరసనలు తెలుపుతున్న ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా
3:43 PM, 8 Dec
రాత్రి అమిత్ షాతో భేటీ కానున్న రైతు సంఘాలు
3:43 PM, 8 Dec
ముగిసిన భారత్ బంద్... కొన్ని చోట్ల తప్ప మిగతా చోట్లంతా పెద్దగా కనిపించని బంద్ ప్రభావం.
2:40 PM, 8 Dec
రైతు ఉద్యమానికి ప్రజలంతా మద్దతు తెలపాలంటూ కోరిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ
2:10 PM, 8 Dec
గతకొన్నేళ్లుగా ప్రభుత్వాలు దళారీల మధ్య వ్యవసాయం నిర్వీర్యం అయ్యింది. రైతుల మేలుకోసమే విప్లవాత్మకమైన చట్టాలు తీసుకొచ్చాం: జీవీఎల్
1:54 PM, 8 Dec
దేశంలో రైతులకు వ్యతిరేకంగా ఈ వ్యవసాయం బిల్లు ఉంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ రైతులకు మద్దతుగా నిలుస్తోంది:మంత్రి కేటీఆర్
1:30 PM, 8 Dec
ముంబైలో కనిపించని భారత్ బంద్ ప్రభావం. రోజువారీలానే మాతుంగా ప్రాంతంలో తెరిచి ఉన్న దుకాణాలు
12:30 PM, 8 Dec
భారత్‌ బంద్‌లో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న ఎమ్మెల్సీ కవిత
12:24 PM, 8 Dec
కోఠి ఉమెన్స్ కాలేజ్ దగ్గర రైతులకు మద్దతుగా నిలిచిన వామపక్షాలు. ఆందోళనలు నిర్వహిస్తున్న ఎర్రదండు
12:24 PM, 8 Dec
హైదరాబాదు
హైదరాబాదు
మేడ్చల్‌లో భారత్‌బంద్‌లో పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన మంత్రి మల్లారెడ్డి
12:01 PM, 8 Dec
భారత్‌ బంద్ సందర్భంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
11:55 AM, 8 Dec
షాద్‌నగర్ జాతీయరహదారిపై భారత్‌బంద్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్
11:54 AM, 8 Dec
సికింద్రాబాద్
సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మంత్రి తలసాని రైతులకు మద్దతుగా నినాదాలు
11:49 AM, 8 Dec
ఢిల్లీ - ఉత్తర్ ప్రదేశ్ సరిహద్దులో నిరసనలు చేపడుతున్న రైతు సంఘాలు
11:08 AM, 8 Dec
అస్సాం
గౌహతిలో రైతుసంఘాలు భారత్‌బంద్‌కు పిలుపును ఇవ్వడంతో మద్దతుగా నిలిచిన కొందరిని అరెస్టు చేసిన పోలీసులు
10:57 AM, 8 Dec
హైదరాబాదు
రైతులకు మద్దతుగా హైదరాబాదులోని పాతబస్తీలో షాపులు మూసివేసిన దుకాణాదారులు
10:55 AM, 8 Dec
తెలంగాణ
భారత్‌బంద్‌కు టీఆర్ఎస్ పార్టీ మద్దతు. పలు ప్రాంతాల్లో నిరసనల్లో పాల్గొన్న మంత్రులు ఎమ్మెల్యేలు
10:40 AM, 8 Dec
జార్ఖండ్
జార్ఖండ్‌ రాజధాని రాంచీలో నిరసనకారుల స్లోగన్లు. భారత్‌ బంద్‌లో భాగంగా రైతులకు మద్దతుగా నినాదాలు
10:23 AM, 8 Dec
పశ్చిమ బెంగాల్
రైతులు ఇచ్చిన భారత్‌బంద్ పిలుపునకు మద్దతుగా సీఐటీయూ. అసన్‌సోల్‌లో బంద్ పాటిస్తూ నిరసన తెలుపుతున్న సీఐటీయూ
10:17 AM, 8 Dec
మహారాష్ట్ర
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్ర హోంమంత్రి లేదా ప్రధాన మంత్రి రైతులతో చర్చలు జరిపేవారు. వారికి ఆ చిత్తశుద్ధి లేదు: శివసేన ఎంపీ సంజయ్ రౌత్
10:12 AM, 8 Dec
కర్నాటక
బెంగళూరులోని విధాన సౌధలోని గాంధీ విగ్రహం ఎదుట కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులకు మద్దతుగా నిరసనలు. నల్లజెండాలతో నిరసన తెలిపిన కాంగ్రెస్ నాయకులు
10:11 AM, 8 Dec
భారత్‌ బంద్‌ను పాటిస్తున్న పలు రాష్ట్రాలు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన రైతులు
READ MORE

English summary
Farmers have given a call for Bharat Bandh on Tuesday from 11 am to 3pm in view to protest against the farm laws that were brought in by the govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X