వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ బంద్ ఎఫెక్ట్: హాస్పిటల్‌కు తీసుకెళుతుండగా రెండేళ్ల చిన్నారి మృతి

|
Google Oneindia TeluguNews

పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీతో పాటు మరో 20 పార్టీలు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలోనే కొన్ని చోట్ల బంద్ హింసాత్మకంగా మారగా మరికొన్ని చోట్ల ప్రశాంతగా కొనసాగింది. కానీ బీహార్‌లో మాత్రం బంద్ కారణంగా రెండేళ్ల చిన్నారి కన్నుమూసింది. అస్వస్థతతకు గురైన చిన్నారిని జెహానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తల్లిదండ్రులు ఆటోలో తరలిస్తుండగా బంద్ పేరుతో ఆటోను ఆందోళనకారులు అడ్డుకోవడంతో చిన్నారి ఆటోలోనే మృతి చెందింది. ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. చిన్నారి మృతికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.

<strong>భారత్ బంద్ దెబ్బకు బెంగళూరు ప్రజలకు నో క్యాబ్, ఆటోల్లో డబుల్ చార్జ్</strong>భారత్ బంద్ దెబ్బకు బెంగళూరు ప్రజలకు నో క్యాబ్, ఆటోల్లో డబుల్ చార్జ్

దేశంలో భయానక వాతావరణాన్ని కాంగ్రెస్ సృష్టిస్తోందని రవిశంకర ప్రసాద్ మండిపడ్డారు. మరణించిన చిన్నారికి బాధ్యత ఎవరుతీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ దీనికి సమాధానం చెప్పాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు.

 Bharath bandh effect: Two year old girl dies on the way to hospital

గత రెండురోజులుగా బేబీకుమార్ అనే చిన్నారి విరేచనాలతో బాధపడుతోంది. తన పరిస్థితి విషమిస్తుండటంతో తన తండ్రి ప్రమోద్ మాంజీ జెహనాబాద్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిర్ణయంచారు. అయితే బంద్ కారణంగా తన బిడ్డను హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు ఎవరూ తమ వాహనాలు ఇవ్వలేదు. చివరకు ఒక ఆటో రిక్షా డ్రైవర్ బిడ్డను హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు అంగీకరించాడు. నేషనల్ హైవే 83 పై జెహానాబాద్‌కు బయలు దేరాడు. ప్రతి చోట ఆందోళనకారులు ఆటోను అడ్డుకున్నారు. మార్గమధ్యంలో తన కూతురు స్పృహ కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు ప్రమోద్. జెహానాబాద్ పొలిమేర్లలోకి ఆటో ప్రవేశించగానే తన బిడ్డ మృతి చెందిందని భోరున విలపించాడు ప్రమోద్.

తన వాహనం సరైన సమయంలో ఆస్పత్రికి వెళ్లి ఉంటే బిడ్డ బతికేదని ప్రమోద్ చెప్పాడు. సాధారణంగా తన గ్రామం నుంచి జెహానాబాద్‌కు చేరాలంటే గంట సమయం పడుతుందని కానీ సోమవారం బంద్ సందర్భంగా మూడు గంటల సమయం పట్టిందని విలపించాడు ప్రమోద్. ఇదిలా ఉంటే బిడ్డకు విరేచనాలు రెండ్రోజుల క్రితం అయినప్పుడే హాస్పిటల్‌కు తీసుకురావాల్సి ఉండేదని... అది విస్మరించి బంద్ కారణంగా బిడ్డ చనిపోయిందని చెప్పడం సరికాదని జెహానాబాద్ ఎస్‌డీఓ అన్నారు.

English summary
A two-year-old girl died on her way to Jehanabad civil hospital in Bihar as the vehicle carrying her got stuck in a road blockade caused by Bharat Bandh supporters on Monday.The Congress, supported by other opposition parties, called for a nationwide protests over rising fuel prices and depreciating rupee.The incident acquired a political colour when Union Minister Ravi Shankar Prasad questioned Rahul Gandhi and Congress over the death of the minor girl. Hitting out at the Congress over the issue, Prasad said, "Atmosphere of fear is being created in the country. Who will take responsibility for the child's death? Congress must give an answer."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X