వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐసీసీ ఛైర్మన్‌గా పారిశ్రామిక దిగ్గజం సునీల్‌ మిట్టల్‌

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌(ఐసీసీ) ఛైర్మన్‌గా భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సునీల్‌ మిట్టల్‌ ఎన్నికయ్యారు. దాదాపు వందేళ్ల చరిత్ర కలిగిన ఐసీసీకి ఛైర్మన్‌గా ఎన్నికైన మూడో భారతీయుడు మిట్టల్‌ కావడం విశేషం.

ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ ఛైర్మన్‌ టెర్రీ మెక్‌గ్రామ్‌ నుంచి మిట్టల్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక నుంచి టెర్రీ ఐసీసీ గౌరవ ఛైర్మన్‌గా ఉంటారు.

mittal

ఈ సందర్భంగా మిట్టల్‌ మాట్లాడుతూ.. ప్రతిష్ఠాత్మక బిజినెస్‌ ఆర్గనైజేషన్‌కు ఛైర్మన్‌గా పనిచేసే అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నన్నట్లు తెలిపారు. ఐసిసి ప్రపంచ వాణిజ్య అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. అగ్రికల్చరల్, కమోడిటీస్ మార్కెట్లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

51వ ఛైర్మన్‌గా మిట్టల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. కాగా, ఐసిసికి 130 దేశాల్లో 6.5మిలియన్ల సభ్యులున్నారు. మిట్టల్‌ ప్రస్తుతం వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ టెలికమ్యూనికేషన్‌ స్టీరింగ్‌ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. భారత్‌-అమెరికా, భారత్‌-యూకే, భారత్‌-జపాన్‌ సీఈవో ఫోరమ్‌లలోనూ మిట్టల్‌ సభ్యుడిగా ఉన్నారు.

English summary
Sunil Bharti Mittal, Bharti Enterprises' founder and chairman, has been elected Chairman of the International Chamber of Commerce (ICC), taking over from Terry McGraw, Chairman Emeritus of S&P Global.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X