వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ టెల్ కు ఊరట: టెలినార్ తో డీల్ కు సెబీ గ్రీన్ సిగ్నల్

దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కు సెబీ ద్వారా భారీ ఊరట లభించింది.ఎయిర్ టెల్ టెలినార్ డీల్ కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: దేశీయ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్ కు సెబీ ద్వారా భారీ ఊరట లభించింది.ఎయిర్ టెల్ టెలినార్ డీల్ కు సెబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జియో షాక్ తో ఇబ్బందిపడిన ఎయిర్ టెల్ ఉపశమనం లభించనుంది.

నార్వే టెలికం ఆపరేటర్ టెలినార్ భారతీయ వ్యాపారాన్ని స్వాధీనం చేసుకొన్నందుకు సెబీ, స్టాక్ ఎక్స్చేంజీలకు ఆమోదం లభించనుందని ఎయిర్ టెల్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో చెప్పింది.

టెలినార్ కమ్యూనికే్షన్స్ ను విలీనం చేసుకొనేందుకు అటు స్టాక్ ఎక్స్చేంజీలు , ఇటు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి పొందిన వార్తలతో మార్కెట్లో భారతీ ఎయిర్ టెల్ కౌంటర్ బాగా పుంజుకొంది.

దాదాపు 3 శాతానికిపైగా జంప్ చేసింది, మరోవైపు టెలినార్, ఎయిర్ టెల్, విలీన ఆమోదానికిగాను భారతీ టెలినార్ రెండు కలసి జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఢిల్లీ బెంచ్ వద్ద ధరఖాస్తును దాఖలు చేశాయి.

 Bharti gets Sebi, bourses’ nod on Telenor acquisition

అలాగే ఫెయిర్ ట్రేడ్ రెగ్యులేటర్, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా చట్టబద్దమైన ఆమోదాన్ని కూడ పొందాల్సి ఉంది.కాగా, ఫిబ్రవరి 23న,టెలినార్ ను కొనుగోలు చేయనున్నామని ఎయిర్ టెల్ భారత్ ప్రకటించింది. ఈ వలీనం ద్వారా రెవిన్యూ మార్కెట్ వాటాను 35 శాతానికి పెంచుకోవడమేకాకుండా గుజరాత్, మహరాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ లో మరింత బలోపేతం కానున్నట్టు తెలిపింది.

టెలికం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు, ఒక్క దెబ్బతో మిగతా టెలికం కంపెనీలన్నీ కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్, టెలినార్ విలీనం ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.జియో ఎంట్రీతో వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యూలార్ కూడ విలీన బాటలో పయనిస్తున్న సంగతి తెలిసిందే. అప్పుల ఊబిలో కూరుకొన్న ఆర్ కాం, ఎయిర్ సెల్ వంటి ఇతర ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడిని పెంచింది.

English summary
The country’s largest telecom operator, Bharti Airtel, on Thursday said that it has got the approval of Sebi and the stock exchanges on its acquisition of the Indian business of Norwegian telecom operator Telenor. Bharti said it received the approval of the capital markets regulator, BSE and NSE for the proposed scheme of merger between Airtel and Telenor (India) Communications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X