వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాస్ట్‌కు ట్రయల్: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో పురోగతి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో పురోగతి లభించింది. ఈ కేసులో ఉగ్రవాది అసదుల్లా అక్తర్‌ను విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తీసుకువచ్చిన జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు అతని వద్ద నుంచి పేలుళ్లకు సంబంధించి సమాచారాన్ని సేకరించారు.

పేలుళ్లకు ముందు అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ ఇంట్లో అద్దెకు ఉన్న ఉగ్రవాదులు, పేలుళ్లకు సైకిల్, కుక్కర్ సామాగ్రిని ఉపయోగించారు. వీటిని జుమ్మేరాత్ బజార్, మలక్‌పేట్‌లో కొనుగోలు చేసినట్లు విచారణలో ఉగ్రవాది అక్తర్ వెల్లడించారు. పేలుళ్లకు ముందు రోజు హయత్‌నగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతంలో బాంబు పేలుడు ట్రాయల్స్ చేశామని చెప్పాడు.

yasin bhatkal

అందులో సక్సెస్ అయిన తర్వాతే బాంబు టైమింగ్ పెట్టినట్లు తెలిపాడు. పేలుడుకు ఉదయం పదకొండు గంటలకు బాంబులను సిద్ధం చేశామని, బాంబులను ఆటోలో దిల్‌సుఖ్‌నగర్‌కు తీసుకెళ్లినట్లు చెప్పాడు. పేలుళ్ల అనంతరం మంగళూరు, నేపాల్‌కు పారిపోయినట్లు విచారణలో ఉగ్రవాది అక్తర్ తెలిపాడు.

విడిభాగాలతో సైకిళ్లు తయారు చేసిన అనంతరం పేలుళ్ల రోజు మలక్‌పేట రైల్వే స్టేషన్లో సైకిళ్లు ఉంచి, ఆ సైకిళ్లకు టిఫిన్ బాక్సు బాంబులు అమర్చారు. దిల్‌సుఖ్ నగర్ 107 బస్టాప్ వద్ద ఓ సైకిల్, ఎ1 మిర్చి సెంటర్ వద్ద మరో సైకిల్ ఉంచారని వెల్లడించాడు. తమకు పేలుడు పదార్థాలు భత్కల్ ఇచ్చినట్లుగా చెప్పాడు.

English summary
The NIA has alleged that the absconding Indian Mujahideen terror suspect Riyaz Bhatkal had supplied explosive materials for the Dilsukhnagar bomb blasts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X