యోగి ఆదిత్యనాథ్‌ను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వను: ప్రత్యర్థి ఎవరో ఫిక్స్: టగ్ ఆఫ్ వార్?
లక్నో: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేడి క్రమంగా పతాకస్థాయికి చేరకుంటోంది. నాలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటంతో.. ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఏర్పడింది. అందులోనూ దేశ రాజకీయ స్థితిగతులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న అతి పెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ కూడా అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోండటంతో అందరి దృష్టీ దీనిపై పడింది. ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లల్లో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఈసీ.
కళామతల్లిపై
ఏపీ
ప్రభుత్వం
దాడి:
అదో
బ్రోతల్
హౌస్:
కొడాలి
నాని
క్యాసినో
కంటే
ఘోరమా:
నారాయణ
తొలిదశ ఫిబ్రవరి 10వ తేదీన ఆరంభమౌతుంది. చివరి దశ పోలింగ్ మార్చి 7న ఉంటుంది. అదే నెల 10వ తేదీన ఓట్ల లెక్కింపును నిర్వహించేలా షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘ. ఉత్తర ప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్ ఉంటుంది. ఫిబ్రవరి 10, 14, 20, 23, 27, మార్చి 3, 7 తేదీల్లో 15,05,82,750 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అధికారం ఎవరిని వరిస్తుందనేది అదే నెల 10వ తేదీన తేలుతుంది.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయాన్ని సాధించిన అనంతరం అనూహ్యంగా ముఖ్యమంత్రి పదవి ఆయనకు దక్కింది. ఎమ్మెల్యే కూడా కాని యోగి చేతిలో ప్రభుత్వ పగ్గాలను పెట్టింది బీజేపీ అధిష్ఠానం. అప్పటికి ఆయన గోరఖ్‌పూర్ ఎంపీ. వచ్చే ఎన్నికల్లో ఆయన గోరఖ్‌పూర్ సదర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు.
1989 తరువాత ఒక్కసారి మాత్రమే బీజేపీ ఇక్కడ ఓడిపోయింది. రాధా మోహన్ దాస్ అగర్వాల్.. గోరఖ్‌పూర్ స్థానానికి ప్రస్తుతం ప్రాతినిథ్యాన్ని వహిస్తున్నారు. ఆయనకు బదులుగా యోగి ఆదిత్యనాథ్.. ఇక్కడ పోటీ చేయనున్నారు. దశాబ్దాల కాలం పాటు బీజేపీకి కంచుకోటగా ఉంటూ వస్తోండటం, స్వయంగా యోగి బరిలోకి దిగడం వల్ల గెలుపు నల్లేరు మీద నడకే అవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆయనకు ఇదే తొలిసారి.
అలాంటి చోట.. యోగిని ఢీ కొట్టడానికి భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ బరిలోకి దిగనున్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా యోగిపై తాను పోటీ చేయబోతున్నానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఆజాద్‌కు కూడా ఇదే తొలిసారి. తాను గెలిచినా, గెలవకపోయినా ఫర్వాలేదని, యోగి మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టకూడదనేది తన పంతం అని అన్నారు. ఇక్కడ సమాజ్‌వాది పార్టీ.. బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొని ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.