వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

84 ఏళ్ల సామాజిక కార్యకర్త అరెస్ట్: భీమా కోరెగావ్ హింసతో సంబంధం, వారెంట్ చూపించకుండా..

|
Google Oneindia TeluguNews

భీమా కోరేగావ్ హింసకు సంబంధించి ఎన్ఐఏ విచారణ కొనసాగుతోంది. అయితే గురువారం రోజున అధికారులు ఓ సామాజిక కార్యకర్త, 83 ఏళ్ల ఫాదర్‌ జెసూట్‌ (స్టాన్ స్వామి)ను అదుపులోకి తీసుకున్నారు. 2018 జనవరి 1వ తేదీన పుణె సమీపంలో భీమా-కోరెగావ్ వద్ద హింస చెలరేగిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో పాత్ర ఉందని పలువురు వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

కేంద్రంలో ఉండగా..

కేంద్రంలో ఉండగా..


బాగైచా సామాజిక కేంద్రంలో స్వామి ఉంటున్నారు. అక్కడికి జార్ఖండ్ ఎన్ఐఏ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తున్నామని తెలిపారు. ఆ సమయంలో ర్యాష్‌గా ప్రవర్తించారని.. వారెంట్ కూడా చూపించలేదని స్వామి సహచరులు పేర్కొన్నారు. అయితే ఇదే కేసులో ఈ ఏడాది ఆగస్టులో ఎన్ఐఏ అధికారులు ప్రశ్నించారు. దీంతోపాటు 2018లో మహారాష్ట్ర పోలీసులు ఇంటి వద్ద తనిఖీ చేసి కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. పుణె సమీపంలోని భీమా-కోరేగావ్ దగ్గర 2018 జనవరి 1న హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ రోజున లక్షలాది మంది దళితులు ఇక్కడ సమావేశం కానున్నారు.

ఎల్గాన్ పరిషత్ సదస్సు.. రెచ్చగొట్టారని..

ఎల్గాన్ పరిషత్ సదస్సు.. రెచ్చగొట్టారని..

హింస చెలరేగడానికి ఒక రోజు ముందు 2017 డిసెంబర్ 31న పుణెలో ఎల్గాన్ పరిషత్‌ను నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న వారు చేసిన ప్రసంగాలు మరుసటి రోజు హింసను రాజేశాయని ఆరోపిస్తూ ఫిర్యాదు నమోదైంది. ఆ ఫిర్యాదు ప్రాతిపదికగా పుణె పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఎల్గార్ పరిషత్ వెనుక మావోయిస్టుల హస్తం ఉందని.. మావోయిస్టు సంస్థలతో సంబంధం ఉందనే అనుమానిస్తున్నారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల నుంచి వామపక్ష వైఖరి గల ఉద్యమకారులు చాలా మందిని పుణె పోలీసులు అరెస్ట్ చేశారు.

Recommended Video

Sushant Singh Rajput : సుశాంత్ సూసైడ్ కేసు లో రియాను అరెస్ట్ చేయాలి.. NIA దర్యాప్తుకు డిమాండ్!
రంగంలోకి ఎన్ఐఏ

రంగంలోకి ఎన్ఐఏ

అందులో విరసం నేత వరవరరావు కూడా ఉన్నారు. అయితే తాజాగా స్వామిని కూడా ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో పుణె పోలీసులు నవంబర్ 15, 2018 తేదీన చార్జీషీట్ దాఖలు చేశారు. తర్వాత 2019 ఫిబ్రవరి 21వ తేదీన అనుబంధ చార్జీషీట్ కూడా దాఖలు చేశారు. ఈ కేసును ఎన్ఐఏకి బదిలీ చేయడంతో ఈ ఏడాది జనవరి 24వ తేదీన దర్యాప్తు చేపట్టింది.

English summary
Social activist Stan Swamy was arrested by the National Investigation Agency from Ranchi in Jharkhand on Thursday in connection with the Bhima Koregaon violence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X