వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరవరరావు, మావోయిస్టు నేత గణపతిపై 1837 పేజీల ఛార్జిషీట్

|
Google Oneindia TeluguNews

పుణే: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రలోని భీమా-కోరేగావ్ అల్లర్లకు సంబంధించిన కేసులో పుణే పోలీసులు ఛార్జిషీట్ ను రూపొందించారు. విప్లవ రచయిత వరవరరావు, మావోయిస్టు నేత గణపతి సహా మరో ముగ్గురిపై 1837 పేజీల ఛార్జిషీట్ నమోదు చేశారు. సుధా భరద్వాజ్, అరుణ్ ఫెరీరా, వర్నన్ గోన్ సాల్వ్స్ లపై ఛార్జీషీట్ నమోదైంది. భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో అయిదుమంది నిందితులపై ఛార్జిషీట్ ను నమోదు చేయడానికి 90 రోజుల అదనపు సమయం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆదేశాలను సుప్రీంకోర్టు ఈ నెల 13వ తేదీన జారీ చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన వారం రోజుల్లోనే పుణే పోలీసులు ఛార్జిషీట్లను నమోదు చేశారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై పుణే పోలీసులు ఇదివరకు హైదరాబాద్ కు వచ్చి, వరవరరావు ఇంటిని సోదా చేశారు. ఆయనను విచారించారు. అనంతరం వదిలిపెట్టారు. తాజాగా వరవరరావుపైనా ఛార్జిషీట్ దాఖలు చేశారు.

సమర్థించిన సుప్రీంకోర్టు

సమర్థించిన సుప్రీంకోర్టు

భీమా కోరేగావ్ అల్లర్ల కేసులో ప్రధాన నిందితులపై ఛార్జిషీటును నమోదు చేయడానికి 90 రోజుల అదనపు సమయం కావాలంటూ దాఖలైన పిటీషన్ ను కొద్దిరోజుల కిందటే బోంబే హైకోర్టు కొట్టివేసింది. నిందితులపై వెంటనే ఛార్జిషీట్ ను నమోదు చేయాల్సిందిగా ఆదేశించింది. బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. ఇదివరకు బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఈ కేసులో అయిదు మంది ప్రధాన నిందితులపై ఛార్జిషీట్ ను నమోదు చేయడానికి 90 రోజుల అదనపు సమయం ఇవ్వడానికి అనుమతి ఇస్తూ ఇదివరకే బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని సూచించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీనితో ప్రధాన నిందితుడైన సురేంద్ర గాడ్లింగ్ సహా నలుగురికి `బై డిఫాల్ట్`గా లభించే బెయిల్ ఇక దొరకదు.

వరవరరావు, గణపతితో పాటు మరికొందరు

వరవరరావు, గణపతితో పాటు మరికొందరు

భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో ప్రముఖ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, నాగ్ పూర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ షోమా సేన్, దళిత సంఘాల కార్యకర్త సుధీర్ ధవాలే, సామాజిక కార్యకర్తలు మహేష్ రౌత్, కేరళకు చెందిన రోనా విల్సన్ లను గత ఏడాది 24వ తేదీన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులో వారికి సంబంధాలు ఉన్నాయని వారిపై కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాల నిరోధర చట్టం (యూఏపీఏ) కింది మహారాష్ట్ర పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. గత ఏడాది జూన్ నుంచి వారు పోలీసుల అదుపులో ఉన్నారు. ఇప్పటిదాకా మహారాష్ట్ర పోలీసులు ఆ అయిదుమందిపై ఛార్జిషీటును దాఖలు చేయలేదు.

పుణే ట్రయల్ కోర్టు 90 రోజుల గడువు ఇచ్చినా..

పుణే ట్రయల్ కోర్టు 90 రోజుల గడువు ఇచ్చినా..

ఛార్జిషీటును దాఖలు చేయడానికి 90 రోజుల అదనపు సమయం తమకు కావాలంటూ మహారాష్ట్ర పోలీసులు ఇదివరకు పుణే న్యాయస్థానానికి పిటీషన్ దాఖలు చేశారు. పోలీసులు కోరినట్టుగా పుణే న్యాయస్థానం వారికి అనుమతి ఇస్తూ, ఉత్తర్వులను జారీ చేసింది. అనంతరం ఈ కేసు బోంబే హైకోర్టుకు చేరింది. దీనిపై దాఖలైన పిటీషన్ ను విచారణకు స్వీకరించిన బోంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పుణే న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కొట్టి వేసింది. నిందితులపై వెంటనే ఛార్జిషీట్ ను దాఖలు చేయడానికి మార్గం సులువు చేసింది.

ఈ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో పిటీషన్ దాఖలైంది. ఈ పిటీషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు దీనిపై వాదోపవాదాలను ఆలంకించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ ఎస్ కె కౌల్, జస్టిస్ ఎల్ ఎన్ రావులు ఈ పిటీషన్ పై విచారణ చేపట్టారు. బోంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చారు. అనంతరం.. తమ తుది తీర్పును రిజర్వ్ చేశారు.

నిందితులపై ఛార్జిషీట్ ను దాఖలు చేయడానికి 90 రోజుల అదనపు సమయాన్ని ఇస్తూ గతంలో భీమా-కోరేగావ్ అల్లర్లపై పుణే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది. సాధారణ బెయిల్ కోసం నిందితులు దాఖలు చేసుకున్న పిటీషన్ పై పుణే న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ప్రభావం చూపుతుందా? లేదా? వివరణ ఇవ్వాలని సూచించింది.

పుణే ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టేసిన బోంబే హైకోర్టు

పుణే ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టేసిన బోంబే హైకోర్టు

పుణే న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటీషన్ పై బోంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మృదుల భట్కర్ విచారణ చేపట్టారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదంటూ తాత్కాలికంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. నవంబర్ 1వ తేదీ వరకు ఈ కేసును అబెయన్స్ లో పెట్టారు. అనంతరం.. ఈ కేసు సుప్రీంకోర్టు మెట్టెక్కింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అనంతరం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. తాజాగా బుధవారం.. తన తీర్పును వెలువరించింది.

సుప్రీంకోర్టు వెలువరించిన తాజా తీర్పు నిందితులకు ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఇప్పటికే కస్టడీలో ఉన్న అయిదుమందిపై ఛార్జిషీటు దాఖలు చేయడానికి మహారాష్ట్ర పోలీసులకు ఇక గడువు దొరక్కపోవచ్చు. `బై డిఫాల్ట్`గా కూడా వారికి బెయిల్ లభించే అవకాశలకు ఉన్న దారులు మూసుకుపోయినట్టే. ప్రధానమంత్రి నరేంద్రమోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలను కూడా ఈ అయిదుమంది ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో హైదరాబాద్ కు చెందిన విప్లవ రచయిత వరవరరావును పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించిన అనంతరం విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనపై కూడా ఛార్జిషీట్ నమోదు చేశారు.

English summary
Bhima Koregaon case: Pune Police files a 1,837 page charge-sheet against Sudha Bharadwaj, Varavara Rao, Arun Ferreira, Vernon Gonsalves and wanted accused Ganapathy, the former General Secretary of banned organisation CPI(M). Activist and lawyer Sudha Bhardawaj. Last week the Supreme Court had set aside the Bombay High Court order refusing to grant 90 days extension to Maharashtra Police for filing the charge sheet in the Koregaon-Bhima violence case. The apex court, however, said that the five rights activists may seek regular bail in the case as the Mahasrashtra Police has already filed the charge sheet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X