వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిగ్గీరాజాకు షాక్.. కాంగ్రెస్ షేక్.. ఆ యువకుడికి బీజేపీ సన్మానం

|
Google Oneindia TeluguNews

భోపాల్ : లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నువ్వా నేనా అనే రీతిలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు పీక్ స్టేజీకి చేరింది. ఒకరిపై మరొకరు ఆరోపణాస్త్రాలు సంధిస్తూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఆ క్రమంలో ప్రత్యర్థులకు వ్యతిరేకంగా.. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా భోపాల్ లో కాంగ్రెస్ పార్టీ చవిచూసిన చేదు అనుభవాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారు లోకల్ బీజేపీ లీడర్లు.

మంగళవారం నాడు భోపాల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ కు ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 15 లక్షలు ప్రతి ఒక్కరికి ఇస్తానన్నారు. మీలో ఎవరికైనా వచ్చాయా అంటూ అక్కడున్నవారిని ప్రశ్నించారు. అయితే అమిత్ మాలి అనే యువకుడు చేయెత్తడంతో అతడిని సాదరంగా స్టేజీ పైకి ఆహ్వానించారు. అమిత్ మాలికి మైక్ అందివ్వగానే.. మోడీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్టులను అంతమొందించారు, అది చాలు అని సమాధానమిచ్చారు. దాంతో డిగ్గీ రాజా సహా అక్కడున్న కాంగ్రెస్ నేతలు షాక్ కు గురయ్యారు. వెంటనే ఆ యువకుడిని కిందికి పంపించేశారు.'

Bhopal BJP felicitates Amit Mali the youth who outwitted Digvijay Singh

ఎన్నికల ఫలితాల రోజే పెట్రో ధరలు పెరుగుతాయట.. బీజేపీపై కాంగ్రెస్ బాంబ్..!ఎన్నికల ఫలితాల రోజే పెట్రో ధరలు పెరుగుతాయట.. బీజేపీపై కాంగ్రెస్ బాంబ్..!

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పబ్లిక్ మీటింగ్ లో మోడీకి అనుకూలంగా ధైర్యంతో మాట్లాడారని స్థానిక బీజేపీ నాయకులు అమిత్ మాలిని ఆకాశానికి ఎత్తుతున్నారు. మోడీని పొగిడి డిగ్గీరాజాకు షాకిచ్చారని ఖుషీ అవుతున్నారు. అనవసర ఆరోపణలు చేస్తూ బీజేపీపై, నరేంద్ర మోడీపై బురదజల్లుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పారంటూ అతడిని సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలున్నా, మోడీ గురించి మాట్లాడటం వల్ల తనకేమీ ఇబ్బంది కలగలేదన్నారు. స్టేజీ మీద నుంచి దించేసిన తర్వాత కూడా కాంగ్రెస్ కార్యకర్తలెవరూ తనను ఏమీ అనలేదని వివరించారు.

English summary
The BJP on Tuesday felicitated Amit Mali, the youth from Madhya Pradesh who readily answered Congress leader Digvijaya Singh's query on Prime Minister Narendra Modi's promise of depositing Rs 15 lakh in the accounts of citizens. Speaking to ANI after being felicitated, Mali said, "He (Digvijaya Singh) had asked who all got Rs 15 lakh in their accounts, so I raised my hand. I went to the stage and told him about the surgical strikes, he made me step down from the stage. Nobody misbehaved with me afterward."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X