వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాన్స్‌‌జెండర్‌‌ల కోసం భోపాల్‌లో ప్రత్యేక స్టడీ సెంటర్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

భోపాల్: దేశంలో తొలిసారిగా ట్రాన్స్‌‌జెండర్‌‌ల కోసం ప్రత్యేక స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఈ స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ట్రాన్స్‌‌జెండర్‌‌ల కోసం ప్రత్యేక స్టడీ సెంటర్‌ను ఏర్పాు చేస్తోంది.

మనదేశంలో మొదటిసారి ట్రాన్స్‌‌జెండర్‌‌ ఎమ్మెల్యే ఎన్నికైంది కూడా ఈ రాష్ట్రం నుంచే. ఇటీవలే సుప్రీం కోర్టు తీర్పుతో ట్రాన్స్‌‌జెండర్‌లను 'థర్డ్‌ జెండర్‌'గా గుర్తించింది. అయినా సరే వారు సమాజంలో వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారు.

విశ్వవిద్యాలయాల్లో ప్రవేశంగానీ, ఉద్యోగాలు కల్పనలోగానీ వారిని వేరుగానే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ట్రాన్స్‌‌జెండర్ల కోసం ప్రత్యేకించి స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం గొప్ప విషయం. ఈ స్టడీ సెంటర్ నిర్వహణను కేంద్రం ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు అప్పగించనుంది.

Bhopal gets country's first study center for transgenders

బస్సు ప్రమాదంలో ఆరుగురు మృతి

హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లా సమీపంలో రాంపూర్‌ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రాంపూర్‌ నుంచి సిమ్లా వెళ్తున్న బస్సు అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడటంతో బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో 19 మందికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారికి చికిత్స అందిస్తున్నారు.

English summary
Bhopal gets country's first study center for transgenders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X