• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Video:కోర్టుకు రమ్మంటే కుంటిసాకులా.. అక్కడేమో కుప్పిగంతులా: ఎంపీ డ్యాన్స్ వైరల్

|

భోపాల్: కోర్టుకు హాజరు అవ్వమంటే కుంటి సాకులు.. కానీ పెళ్లిళ్లలో మాత్రం కుప్పి గంతులు.. ఇదీ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ పరిస్థితి. ఇదే మేము చెప్పడం కాదు.. ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజెన్లు చేస్తున్న వ్యాఖ్యలు. అవును బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఓ పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ వీడియోలో కనిపించారు. దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ నోటికి పనిచెప్పింది.

  Union Cabinet Reshuffle : దక్షిణాదిన ఏపీకి మొండిచెయ్యి | Impact On AP Key Projects | Oneindia Telugu
   డప్పు మోతకు ప్రగ్యా ఠాకూర్ డ్యాన్స్

  డప్పు మోతకు ప్రగ్యా ఠాకూర్ డ్యాన్స్

  మాలెగావ్ పేలుళ్ల కేసులో ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ఆరోపణలు ఎదురుకుంటున్నారు.ఈ క్రమంలోనే విచారణలో భాగంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు ఇవ్వగా తనకు ఆరోగ్యం బాగుండటంలేదని కోర్టు విచారణకు హాజరుకాలేనని చెప్పుకొచ్చారు ప్రగ్యా ఠాకూర్. ఇక ఈ వీడియో మ్యాటర్‌కు వస్తే... మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఇద్దరి అమ్మాయిల వివాహం ఒకే ముహూర్తానికి జరుగుతోంది.

  ఆ అమ్మాయిలది పేద కుటుంబం కావడంతో ప్రగ్యా ఠాకూర్ తన నివాసంలోనే వివాహం జరిపిస్తున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే డప్పుల మోతకు ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కాలు కదిపారు. చిన్నపాటి స్టెప్పులు వేస్తూ అలరించడమే కాదు... పెళ్లికి వచ్చిన వారిని కూడా తనతో పాటు కలిసి డ్యాన్స్ చేయాలని పిలిచారు. ఈ దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ఆ తర్వాత నెట్టింట్లోకి ఎక్కింది.

  పేదింటి అమ్మాయిల పెళ్లి జరిపించిన ఎంపీ

  ఇదిలా ఉంటే ప్రగ్యా ఠాకూర్ తమ వివాహం తన ఇంట్లో చేయడం తమకు చాలా సంతోషంగా ఉందని పెళ్లి కుమార్తెలు చెప్పారు. ఇలాంటి అదృష్టం చాలా తక్కువమందికి ఉంటుందని అన్నారు. తనది రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబమని.. అలాంటిది తన కుమార్తె పెళ్లి చేసే స్తోమత తనకు లేదని ఓ పెళ్లి కుమార్తె తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ తానే దగ్గరుండి ఈ వివాహం జరిపించడం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆ తండ్రి చెప్పాడు.

  కఠిక పేదరికంలో జీవిస్తున్న తనకు భోపాల్ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ పునర్జన్మను ప్రసాదించారని భావోద్వేగానికి గురయ్యాడు ఆ తండ్రి. తన కూతుళ్ల వివాహం జరిపించడంలో ప్రగ్యా ఠాకూర్ చేసిన సహాయం మరువలేనిదని చెప్పారు. ఠాకూర్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆ తండ్రి చెప్పాడు. ఆమెకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు.

  ప్రగ్యా ఠాకూర్

  ఇదంతా పక్కనపెడితే ప్రగ్యా ఠాకూర్ పై మాత్రం మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. భోపాల్ ఎంపీ సోదరి సమానురాలైన ప్రగ్యా ఠాకూర్ ఇలా బాస్కెట్ బాల్ ఆడటం, ఎవరి సహాయం లేకుండా నడవడం, ఇలా డ్యాన్సులు చేయడం చూస్తే తమకు సంతోషంగా ఉంటుందని సెటైర్లు వేస్తూ కాంగ్రెస్ ప్రతినిధి నరేంద్ర సలూజా ట్వీట్ చేశారు. ఇదే సమయంలో మరో వీడియోను ఆయన తన ట్విటర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

  ఆ వీడియోలో ప్రగ్యా ఠాకూర్ బాస్కెట్ బాల్ ఆడుతుండటం కనిపించారు. ఇప్పటి వరకు ప్రగ్యా ఠాకూర్ వీల్‌ఛైర్‌కు మాత్రమే పరిమితమయ్యారని ఇప్పుడు బాస్కెట్ బాల్ ఆడటం చూస్తుంటే నిజంగా సంతోషంగా ఉందని సెటైర్ వేస్తూ ఆ వీడియోను షేర్ చేశారు నరేంద్ర సలూజ. ఇప్పటి వరకు ప్రగ్యా ఠాకూర్ గాయం కారణంగా నడవలేకపోతున్నారని, ఇప్పుడు ఏకంగా బాస్కెట్ బాల్ ఆడుతున్నారంటే అది నిజంగానే సంతోషకరమైన వార్తంటూ ట్వీట్ చేశారు కాంగ్రెస్ నేత సలూజ.

  ఇదిలా ఉంటే 2008లో మాలెగావ్ బాంబు పేలుళ్ల ఘటనలో ప్రగ్యా ఠాకూర్ నిందితురాలిగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె బెయిల్ పై ఉన్నారు. అంతకుముందు ఆమె తొమ్మిదేళ్ల పాటు జైలు జీవితాన్ని గడిపి 2017లో బెయిల్‌పై విడుదలయ్యారు.

  English summary
  Bhopal MP Pragya Thakur was seen dancing at a wedding event and the video goes viral.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X