వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక ఫోర్న్‌సైట్స్ ఓపెన్ చేస్తే భక్తి పాటలు, ఎందుకిలా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

లక్నో: ఫోర్న్ సైట్స్‌ను బ్లాక్ చేసే యాప్‌ను బనారస్ హిందూ యూనివర్శిటీ న్యూరాలజీ ప్రోఫెసర్ డాక్టర్ విజయనాథ్ ఒక యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌కు హ‌ర హ‌ర మ‌హ‌దేవ‌' అనే పేరు పెట్టారు.స్మార్ట్‌ఫోన్లతో పోర్న్ సైట్లు ఓపెన్ చేస్తే ఈ యాప్ వాటిని ఓపెన్ కాకుండా బ్లాక్ చేయనుంది.

ప్రస్తుతం ఫోర్న్ సైట్లు చూడకుండా కట్టడి చేసే ఈ యాప్ ద్వారా ప్రయోజనం కలుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. టెక్నాలజీ ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉంది. అయితే టెక్నాలజీని మంచి కంటే చెడు కోసం ఎక్కువగా ఉపయోగించే సందర్భాలను చూస్తున్నాం.

దీంతో ఈ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకొంటే అశ్లీల చిత్రాలు ఓపెన్ కావు. ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేయడం వల్ల ఇలాంటి సైట్లు ఓపెన్ కాకుండా చేసేందుకు ఉపయోగపడనున్నాయి.

ఫోర్న్‌సైట్లు ఓపెన్ కాకుండా యాప్

ఫోర్న్‌సైట్లు ఓపెన్ కాకుండా యాప్

ఫోర్న్ సైట్లు స్మార్ట్ ఫోన్లు ఓపెన్ కాకుండా ఉండేలా బనారస్‌ యూనివర్సిటీకి చెందిన న్యూరాలజీ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ విజ‌య‌నాథ్ 'హ‌ర హ‌ర మ‌హ‌దేవ‌' పేరిట యాప్‌ను రూపొందించారు.అశ్లీల చిత్రాలు, తీవ్ర హింస ఉన్న వీడియోలు, ఫోటోలు ఓపెన్‌ చేస్తే ఈ యాప్ పనిచేస్తోంది. ఈ యాప్ ఆ సైట్లను ఓపెన్ కాకుండా అడ్డుకొంటుంది.

పిల్లలపై ఈ యాప్ నిఘా

పిల్లలపై ఈ యాప్ నిఘా

తల్లిదండ్రుల నిఘాకు దొరక్కుండా తప్పించుకుని తిరిగే పిల్లల కోసం ఈ యాప్‌ను తయారు చేసినట్టు డాక్టర్ విజయనాథ్ చెబుతున్నారు. ఈ యాప్‌
ఇన్‌స్టాల్‌ చేశాక హైడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేశారన్న విషయం కూడ ఇతరులు గుర్తించే అవకాశమే లేదు..

ఫోర్న్‌సైట్స్ ఓపెన్ చేస్తే భక్తి పాటలు

ఫోర్న్‌సైట్స్ ఓపెన్ చేస్తే భక్తి పాటలు

ఫోర్న్ సైట్స్ ఓపెన్ చేస్తే భక్తి పాటలు విన్పించేలా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ప్రస్తుతం సంస్కారి యాప్‌గా ప్రసిద్ది చెందింది.దీనిని harharmahadev.co వెబ్‌సైట్ నుంచి ఈ వెబ్ అప్లికేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చని విజయనాథ్‌ తెలిపారు.ప్రస్తుతం ఈ యాప్‌ హిందూ భ‌క్తిపాట‌ల‌ను మాత్ర‌మే ప్లే చేస్తోంద‌ని, త్వ‌ర‌లో ఇత‌ర మ‌తాల గీతాల‌ను కూడా పొందుప‌రిచి యాప్‌ను అభివృద్ధి చేస్తామ‌ని ఆయన వెల్ల‌డించాడు.

ఆండ్రాయిడ్ పోన్లలో యాప్

ఆండ్రాయిడ్ పోన్లలో యాప్


అయితే ల్యాప్‌ ట్యాప్‌లు, డెస్క్‌ టాప్‌ వర్షన్‌లకు ప్రస్తుతం ఈ యాప్‌ అందుబాటులో ఉంది. అయితే అండ్రాయిడ్‌ ఫోన్లకు పూర్తిస్థాయిలో రావటానికి కాస్త సమయం పడుతుందని వెబ్ డెవలపర్‌ అంకిత్‌ శ్రీవాస్తవ చెబుతున్నారు.

English summary
A neurologist at the Institute of Medical Sciences of Banaras Hindu University (IMS-BHU) and his team have developed an application to block unwanted sites, especially pornographic ones, to do away with the onslaught of trash and misinformation on the internet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X