వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్‌కు గుడ్‌బై..! బీజేపీకి జై కొట్టిన కాంగ్రెస్ మాజీ ఎంపీ కలీత

|
Google Oneindia TeluguNews

కాంగ్రెస్ పార్టీకి షాక్‌మీద షాక్ తగులుతున్నాయి. చట్టసభల్లో కోద్దిమంది మాత్రమే ఉన్న కాంగ్రెస్ ఎంపీలు ఒక్కోక్కరుగా జారుకుంటున్నారు. పదవులను వదిలి మరి బీజేపీలోకి చేరుతున్నారు. ఈనేపథ్యంలోనే ఆర్టికల్ 370 విషయంలో పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ బుభనేశ్వర్ కలీతా ఆపార్టీ రాజీనామ చేసిన విషయం తెలిసిందే.. పార్లమెంట్ లోనే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఆయన రాజ్యసభలో చీఫ్ విప్ గా ఉన్నాడు.అయినా కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేయడం తోపాటు ఎంపీ పదవికి కూడ రాజీనామ చేశాడు.

ఎంపీ పదవికి రాజీనామ చేసిన కలీత నేడు బీజేపీ కండువా కప్పుకున్నాడు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆధ్వర్యంలో కలీత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా 370 ఆర్టికల్ రద్దుపై కాంగ్రెస్ పార్టీతో చర్చించానని అయితే కాంగ్రెస్ పార్టీలో స్టేల్ అయిన నేతలు ఉన్నారని విమర్శలు చేశారు.. కాగా ప్రధానమంత్రి మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ది పథంలో కొనసాగుతుందని అయన చెప్పాడు.

Bhubaneshwar Kalita, former Congress chief whip joined in BJP

ఆర్టికల్ రద్దు నిర్ణయానికి మద్దతుగా ఎంపీ కలీత తోపాటు మరో మాజీ ఎంపీ జ్యోతిరాధిత్య సింధియా కూడ ఆర్టికల్ రద్దు నిర్ణయాన్ని స్వాగతించాడు.ఇక హర్యాన మాజీ సీం భూపెందర్ సింగ్ హూడ కుమారురు దీపేందర్ హూడ సైతం ఆర్టికల్ రద్దును స్వాగతించి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇలా అధికారంలో ఉన్నవారే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ సంక్షోభంలో పడుతోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

English summary
Bhubaneshwar Kalita, former Congress chief whip in Rajya Sabha who resigned from the House earlier this week on Friday joined Bharatiya Janata Party in presence of Union Minister Piyush Goyal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X