వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్ ఇండియా విమానంలో పొగలు.. అత్యవసరంగా ల్యాండింగ్... తీరా చూస్తే..

|
Google Oneindia TeluguNews

189 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం రాయ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండయ్యింది. విమానంలో పొగలు రావడంతో ల్యాండ్ చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ ఇండియా విమానం భువనేశ్వర్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

విమానంలోని ఎడమ ఇంజిన్‌లో పొగ వచ్చినట్టు పైలట్ గుర్తించారు. వెంటనే ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో సాయంత్రం 6 గంటలకు ల్యాండ్ చేసినట్టు వివరించారు. ఈ విషయాన్ని రాయ్‌పూర్ విమానాశ్రయ డైరెక్టర్ రాకేశ్ సాహయ్ ధ్రువీకరించారు.

Bhubaneswar-Mumbai Air India flight makes emergency landing in Raipur after fire alarm

ఎయిర్ ఇండియా ఏఐసీ 670 విమానం సాయంత్రం 5.06 గంటలకు భువనేశ్వర్ నుంచి బయల్దేరింది. కాసేపటికే ఇంజిన్‌లో పొగలను పైలట్ గుర్తించారు. వెంటనే ఏటీసీకి సమాచారం అందించి.. రాయ్‌పూర్‌ో దింపేశారు. విమానం దిగాక అగ్నిమాపక సిబ్బంది ఇంజిన్‌ను పరిశీలించారు. అధికారులు పరిశీలించి పొగలు రాలేదని గుర్తించారు. అయితే సాంకేతిక సమస్య వల్ల పొగ వచ్చినట్టు కనిపించి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. దీనిపై విచారణ జరుపుతున్నామని తెలిపారు. దీంతో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ప్రయాణికులను టర్మినల్ బిల్డింగ్‌కు పంపించినట్టు తెలిపారు.

English summary
A Bhubaneswar-Mumbai Air India flight carrying 189 passengers made an emergency landing on Friday at the Raipur airport in Chhattisgarh after a fire alarm, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X