వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలలోకి తిరుమల వెంకన్న! రూ.1కే చీరలిచ్చేస్తున్న వ్యాపారి, ‘కుమారస్వామి సీఎం’

|
Google Oneindia TeluguNews

బీదర్: ఆ దేవుడు ఆదేశించాడు.. ఈ వ్యాపారి పాటిస్తున్నాడు. తనకు కలలో శ్రీవెంకటేశ్వరస్వామి కనిపించి ఆదేశించడంతో.. తాను ఒక రూపాయికే మహిళలకు చీరలను పంచుతున్నట్లు చెప్పాడు కర్ణాటకలోని బీదర్‌కు చెందిన ఓ వ్యాపారి.

వినడానికి కొంచెం వింతగా ఉన్నా.. వారం రోజులుగా ఆ వ్యాపారి మహిళలకు రూపాయికే చీరను ఇస్తున్నాడు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ఆ వ్యాపారి దుకాణం ముందు బారులు తీరారు.

Bidar man gives away saris for free to generate voter awareness

తిరుమల వెంకటేశ్వరస్వామి చెప్పారంటూ.. 5లక్షల చీరలను ఒక్కొక్కటి రూ. 1కే విక్రయిస్తున్నాడు చంద్రశేఖర్ అనే బీదర్ వ్యాపారి. ఆయన జేడీఎస్ పార్టీ అభిమాని.
కాగా, ఈ సంవత్సరం జరిగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ విజయం సాధించి.. తమ నేత కుమారస్వామి మరోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాలన్నది ఆయన కోరిక కావడం గమనార్హం.

Bidar man gives away saris for free to generate voter awareness

కొద్ది రోజుల క్రితం తిరుమల వెంకన్న తన కలలోకి వచ్చి.. కుమారస్వామి మళ్లీ సీఎం కావాలంటే.. 5లక్షల చీరలను పంచాలని చెప్పాడని సృష్టి-దృష్టి శారీ సెంటర్ యజమాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాను ఒక్క రూపాయికే చీరను విక్రయించాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు.

అయితే, 15రోజులు మాత్రమే ఈ చీరలను రూ.1కి విక్రయిస్తానని చెప్పారు. కాగా, జనవరి 15 నుంచి ఆయన ఈ చీరలను రూపాయికే విక్రయిస్తున్నారు. ఇప్పటికే వారం రోజులు అయిపోవడంతో భారీగా మహిళలు ఆ దుకాణం వద్దకు చేరుకుంటున్నారు. రూ.1కే చీర కావాలంటే మహిళలు తమ ఓటర్ ఐడీని తప్పక చూపాల్సిందేని సదరు వ్యాపారి షరతు కూడా పెట్టడం గమనార్హం.

English summary
Chandrashekar Pasarge, owner of 'Sristi-Dristi' sari center and JD(S) supporter from Bidar has been distributing saris for as little as Re 1 since January 15. But there's one caveat: only voter card holders are eligible!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X