• search
 • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Beds Scam: కరోనా దెబ్బ, బెడ్స్ అద్దె మాత్రమే రూ. 144 కోట్లు ? కొంటే రూ. 10 కోట్లు, అయ్యో సీఎం, మచ్చ

|

బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారి దెబ్బకు పేద, మద్య తరగతి ప్రజల బతుకులు తారుమారైనాయి. కరోనా వైరస్ దెబ్బతో లాక్ డౌన్ విధించడంతో కార్మికులు, వలస కూలీల బతుకులు రోడ్డునపడ్డాయి. అయితే కరోనా వైరస్ వలన కొందరు మాత్రం జోబులు నింపుకుంటున్నారు. మాస్క్ లు, శానిటైజర్లు తదితర ఆరోగ్య పరిమైన వస్తువులు, పరికరాలు తయారు చేస్తున్న వారు జోబులు నింపుకుంటున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద COVID-19 చికిత్సా కేంద్రం బెంగళూరులో ప్రాంరభించిన కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఇరాకటంలో పడింది. 10 వేల 100 బెడ్స్ సొంతంగా కొంటే రూ. 10 కోట్లు అవుతోందని, అయితే కాంట్రాక్టర్లకు రూ. 144 కోట్లు అద్దె చెల్లిస్తున్నారని ? ఆరోపణలు వస్తున్నాయి.

Wife master plan: ప్రియుడి కోసం భర్త ఫినిష్, తప్పు మాదికాదు, ఆ సినిమా డైరెక్టర్ ది సార్, చివరికి !

 లాక్ డౌన్ టైంలో సీఎంకు తలనొప్పి

లాక్ డౌన్ టైంలో సీఎంకు తలనొప్పి

ప్రపంచంలోనే అతి పెద్ద COVID-19 చికిత్సా కేంద్రంలో 10, 100 బెడ్స్ (పడకలు) రోజువారి లెక్కన అద్దెకు తీసుకున్న కర్ణాటక ప్రభుత్వం (BBMP)రూ. వందల కోట్ల అవినీతికి పాల్పడిందని, ప్రజల సోమ్మును బీజేపీ నాయకులు స్వాహా చేస్తున్నారని, బెడ్స్ అద్దెలను కావలసిన కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బెంగళూరు నగరంతో సహ నాలుగు జిల్లాల్లో నేటి నుంచి (జూలై 14వ తేదీ) మళ్లీ వారం రోజుల పాటు లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో ఈ బెడ్స్ స్కామ్ ఆరోపణలు రావడంతో కర్ణాటకలోని బీఎస్. యడియూరప్ప ప్రభుత్వం ఉలిక్కిపడింది.

 బెంగళూరు పేరు నిలబెట్టాలని !

బెంగళూరు పేరు నిలబెట్టాలని !

భారతదేశంలోనే అతి పెద్ద COVID-19 చికిత్సా కేంద్రాన్ని ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని బెంగళూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు, పేరు ప్రతిష్ట్రలు ఉన్న విషయం తెలిసింది. అలాంటి సిలికాన్ సిటీలో గత 10 రోజుల నుంచి ఆ నగర ప్రజలు, కర్ణాటక ప్రభుత్వం ఊహించని విధంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. ఇదే సమయంలో ప్రపంచంలోనే అతి పెద్ద కోవిడ్ -19 చికిత్సా కేంద్రాన్ని బెంగళూరులో స్థాపించాలని, సిలికాన్ సిటీ పేరు నిలబెట్టాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అతి పెద్ద కోవిడ్-19 చికిత్సా కేంద్రం ఏర్పాటు చేసిన పనిని BBMPకి అప్పగించారు.

BIECలో కరోనా చికిత్సకు 10, 100 బెడ్స్

BIECలో కరోనా చికిత్సకు 10, 100 బెడ్స్

బెంగళూరు- తుమకూరు జాతీయ రహదారి (ముంబై హైవే)లోని బెంగళూరు అంతర్జాతీయ వస్తు ప్రదర్శనా కేంద్రం (BIEC)లో ప్రపంచంలోనే అతి పెద్ద COVID-19 చికిత్సా కేంద్రం ఏర్పాటు చెయ్యాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప నిర్ణయించారు. BIECలో ఇప్పటికే అన్ని మంచాలు, పరుపులు, దుప్పట్లు, తలదిండ్లు, వాటి కవర్లు అన్నీ సిద్దం చేశారు. కరోనా వైరస్ వ్యాధి సోకిన అనుమానితులకు ఇక్కడ చికిత్స చెయ్యడానికి 2, 400 మంది వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది ఇప్పటికే రెఢీ అయ్యారు.

అద్దె బెడ్స్ కు రూ. 144 కోట్లు ?

అద్దె బెడ్స్ కు రూ. 144 కోట్లు ?

BIECలోని COVID-19 చికిత్సా కేంద్రంలో మొత్తం 10, 100 పడకలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇక్కడ బెడ్ అంటే ఇనుప మంచం, దాని మీద విలాసవంతమైన బెడ్, వాటి మీద కవర్లు, తలదిండ్లు, వాటి కవర్లు ఉన్నాయి. ఒక్కొబెడ్ సెట్ కు ప్రతిరోజు రూ. 800 చొప్పున కొందరు కాంట్రాక్టర్ల నుంచి అద్దెకు తీసుకున్నారు. అంటే 10, 000 బెడ్ లకు ప్రతిరోజు రూ. 80 లక్షల అద్దె చెల్లించాలి. అంటే నెల రోజులకు కోవిడ్-19 చికిత్సా కేంద్రంలోని బెడ్స్ కు అక్షరాల రూ. 24 కోట్లు చెల్లించాలి. BIECలో కోవిడ్ 19 చికిత్సా కేంద్రాన్ని మూడు నెలల నుంచి ఆరు నెలలు నిర్వహించాలని బీబీఎంపీ అధికారులు నిర్ణయించారు. అంటే అక్కడ ఏర్పాటు చేసిన బెడ్స్ కు రూ. 72 కోట్ల నుంచి రూ. 144 కోట్ల మొత్తంలో కేవలం బెడ్స్ కు అద్దెలు చెల్లించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్దం అయ్యిందని ఆరోపణలు బగ్గుమన్నాయి.

సొంతంగా కొంటే రూ. 10 కోట్లు, అతి తెలివితో రూ. 144 కోట్ల అద్దె ?

సొంతంగా కొంటే రూ. 10 కోట్లు, అతి తెలివితో రూ. 144 కోట్ల అద్దె ?

ఒక కరోనా వైరస్ వ్యాధి సోకిన వ్యక్తికి చికిత్స అందించడానికి అక్కడ ఇనుప మంచం, విలాసవంతమైన బెడ్, మూడు సెట్ ల బెడ్ షీట్లు, ఒక తలదిండు, బ్లాంకెట్, టవల్, ప్లాస్టిక్ చేర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం పైన ఉన్న వస్తువులు అన్నీ ఒక్కొ సెట్ కొనుగోలు చెయ్యడానికి దాదాపుగా రూ. 7, 000 అవుతోందని, మొత్తం 10, 000 బెడ్ లు కొనుగోలు చెయ్యాలంటే రూ. 10 కోట్లు వరకు అవసరం అవుతోందని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అంటున్నారు. అయితే మూడు నెలల నుంచి 6 నెలల వ్యవది కాలంలో ఈ బెడ్స్ సెట్ లు అన్నింటికీ కలిపి రూ. 144 కోట్ల వరకు అద్దెలు చెల్లించాలని ఓ అధికారి ఉచిత సలహా ఇచ్చారని, అందుకే ప్రభుత్వం బీబీఎంపీ అధికారులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని ఆరోపణలు ఉన్నాయి.

 లాక్ డౌన్ టైంలో రామరామా !

లాక్ డౌన్ టైంలో రామరామా !

నేటి నుంచి బెంగళూరు సిటీతో పాటు బెంగళూరు గ్రామీణ జిల్లాతో సహ నాలుగు జిల్లాల్లో మళ్లీ లాక్ డౌన్ అమలు చెయ్యడం, సామాన్య ప్రజలు బతులకు మళ్లీ రోడ్ల మీద పడుతున్నాయని విమర్శలు ఎదురౌతున్న సమయంలో బీబీఎంపీ అధికారుల తీరుతో కర్ణాటక ప్రభుత్వానికి రూ. 144 కోట్లు బొక్క పడుతోందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మొత్తం మీద బెంగళూరు పరువు నిలబెట్టాలని ప్రయత్నిస్తున్న కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు మరోసారి ఇరకాటంలో పడింది.

  Lockdown From July 16 To 31 లాక్ డౌన్ బాట పడుతున్న రాష్ట్రాలు, మళ్లీ విధిస్తే ఎలా అంటూ..?
  ఇరకాటంలో సీఎం అప్ప ?

  ఇరకాటంలో సీఎం అప్ప ?

  గత ఆదివారం BIEC చేరుకున్న సీఎం బీఎస్. యడియూరప్ప అక్కడ ఏర్పాటు అవుతున్న ప్రపంచంలోనే అతి పెద్ద COVID-19 చికిత్సా కేంద్రం ఏర్పాట్లను స్వయంగా మెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో సీఎం బీఎస్. యడియూరప్ప విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యాలని ప్రతిపక్షాలతో పాటు సామాన్య ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

  English summary
  BIEC India's biggest COVID-19 centre Scam: BBMP wastes Rs. 144 crores of money by paying contractors Rs. 800 rent per bed per day ?
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X